మే 10న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On May 10, the birthday celebrated | Sakshi
Sakshi News home page

మే 10న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

May 9 2015 11:10 PM | Updated on Sep 3 2017 1:44 AM

మే 10న  పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

మే 10న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 5. వీరికి ఈ సంవత్సరం అన్ని ఆటంకాలూ తొలగిపోయి,

ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
సునీత (గాయని), నమిత (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 5. వీరికి ఈ సంవత్సరం అన్ని ఆటంకాలూ తొలగిపోయి, వృత్తిపరంగా, కుటుంబపరంగా చాలా ప్రోత్సాహకరంగా, సంతోషంగా ఉంటుంది. మీడియాలో పని చేసేవారికిది మేలిమలుపు తిప్పే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో చదువుకోవాలనుకునేవారికి, విదేశాలలో ఉద్యోగాలకోసం ప్రయత్నం చేసేవారికి ఆశాజనకంగా ఉంటుంది. డాక్యుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు  ఆలోచించి చేయడం అవసరం.

పోటీ పరీక్షలు రాసేవారికి విజయం తథ్యం. లక్కీనంబర్స్: 1,5,9. లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్. కుజగ్రహ శాంతికై జపం చేయించుకోవడం, పేద అవివాహిత యువతుల వివాహ ఖర్చులలో పాలుపంచుకోవడం, అనాథల చదువుకు సాయం చేయడం వల్ల వీరికి మరిన్ని అనుకూలమైన అవకాశాలుంటాయి.
 - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 
 

Advertisement
 
Advertisement
Advertisement