ప్రీమియర్‌ ప్రేమయాత్ర | oldage Premiere Expedition | Sakshi
Sakshi News home page

ప్రీమియర్‌ ప్రేమయాత్ర

Dec 19 2017 12:07 AM | Updated on Dec 19 2017 12:07 AM

oldage Premiere Expedition - Sakshi

‘ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనమూ ఏలనో’.. అని కాకుండా ‘ప్రేమ యాత్రలకు మాస్కో మేలేనోయ్‌’ అని పాడుకుంటున్నారు శ్రీదేవీ, బోనీ కపూర్‌ దంపతులు. శ్రీదేవి లేటెస్ట్‌ సినిమా ‘మామ్‌’ సినిమాను రష్యాన్‌ భాషలో డబ్‌ చేశారు. అక్కడ జరిగిన ప్రీమియర్‌ షోకు ఈ దంపతులు హాజరయ్యారు. గులాబీ రంగు గౌనులో ఈ అతిలోక సుందరి తళుకులీనారు. స్వీట్‌గా స్పీచ్‌ ఇచ్చారు. ఆ తర్వాత అభిమానులు ఆటోగ్రాఫ్స్‌ అడిగితే హార్ట్‌ఫుల్‌గా ఇచ్చి, వాళ్ల దిల్‌ ఖుష్‌ అయ్యేలా చేశారు.

ఫ్యాన్స్‌ ‘చాందినీ చాందినీ’ అంటూ శ్రీదేవిని చూసి కేరింతలు కొట్టారు. ఈ చాందినీ ఎవరబ్బా అనుకుంటే శ్రీదేవి సినిమాలు ఫాలో అయ్యేవారు అవమానంగా ఫీలవుతారు. ‘చాందినీ’ సినిమాలో ఆమె టైటిల్‌ రోల్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రీమియర్‌ షోలో బోలెడంత సందడి చేశాక శ్రీదేవి తన డియర్‌ హబ్బీతో కలసి మాస్కో వీధుల్లో విహరించారు. హబ్బీతో కలసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీళ్లతో పాటు రెండో కుమార్తె ఖుషీ కూడా వెళ్లారు. మరి.. ఫస్ట్‌ డాటర్‌ ఏం చేస్తున్నట్లు? ‘ధడక్‌’ సినిమా షూటింగ్‌తో జైపూర్‌లో బిజీగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement