నోస్ట్ర..డామిట్! | Nostra .. damit! | Sakshi
Sakshi News home page

నోస్ట్ర..డామిట్!

Nov 30 2015 12:01 AM | Updated on Sep 3 2017 1:13 PM

నోస్ట్ర..డామిట్!

నోస్ట్ర..డామిట్!

ఇది నిజం కావచ్చు. లేదా తిక్క లెక్క కావచ్చు. ‘తిక్క’ అనే మాటను నెగిటివ్‌గా తీసుకోనవసరం లేదు.

తిక్క లెక్క

ఇది నిజం కావచ్చు. లేదా తిక్క లెక్క కావచ్చు. ‘తిక్క’ అనే మాటను నెగిటివ్‌గా తీసుకోనవసరం లేదు. షార్ప్‌మైండ్ ఉన్నవారు కాస్త తిక్కగా ఉండడం మనం చూస్తున్నదే కదా. ఇక విషయంలోకి వస్తే... ప్రపంచాన్ని ప్రస్తుతం అతలాకుతలం చేస్తున్న భయంకరం ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్’ (ఐఎస్‌ఐఎస్) ఆవిర్భావం గురించి ఫ్రెంచి ప్రవక్త నోస్ట్రడామస్ ఏనాడో హెచ్చరించాడని ఇప్పటి ఆయన వారసులు (సిద్ధాంతాల వారసులు) ఎప్పటివో లెక్కలు తీస్తున్నారు.

ఈ భూగోళంపై క్రైస్తవులకు వ్యతిరేకంగా మూడు శక్తులు పోరాడతాయని, మొదటి రెండు శక్తులు నెపోలియన్, హిట్లర్ కాగా, నోస్ట్రడామస్ చెప్పిన మూడో శక్తి ఐసిస్ కావచ్చని వీరు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే నోస్ట్రడామసే చెప్పినట్లు 27 ఏళ్ల పాటు జరగబోయే మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ భూమండలాన్ని ‘ఐసిస్’ పరిపాలించబోతోందని అనుకోవాలి! నోస్ట్రడామస్ వెబ్‌సైట్  అయితే ఇంకా ‘కచ్చితమైన’ లెక్కని చెప్పింది. 2042లో ప్రపంచం ‘ఐసిస్’ పవర్‌లోకి వచ్చేస్తుందట! డామిట్. ప్రపంచ దేశాలు అంతవరకూ రానిస్తాయా? శాంతి ముందు యుద్ధం ఎంత?!
 

 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement