కుచ్చు కుచ్చు కూనమ్మా!

New fashion to Saree - Sakshi

చీర అంచుకు చేరెనమ్మా!

మహిళల పాశ్చాత్య దుస్తుల్లో బాగా పాపులర్‌ అయిన డిజైన్‌ ‘కుచ్చులు’. స్కర్ట్స్, బ్లౌజ్‌లు, గౌన్లు... వీటిలో చాలారకాల ‘కుచ్చులు’ మనం గమనించవచ్చు. కుచ్చుల గౌన్లలో మెరిసిపోయే కుందనపు బొమ్మలు అని మనం చిన్నారులను చూసీ అనుకుంటూ ఉంటాం. ఈ ‘కుచ్చుల’ అందాన్ని గౌన్లకే కాకుండా మన సంప్రదాయ చీరలకు జత చేసి ఒక వినూత్న కళను తీసుకువచ్చారు డిజైనర్లు. దీంతో ఇవి మోడ్రన్‌ కాలాన్ని మరింత అద్భుతంగా మార్చేశాయి.

ప్రస్తుతం ఫ్యాషన్‌ ప్రపంచంలో రెట్రో స్టైల్‌ తెగ హడావిడి చేస్తోంది. అయినా కొన్ని ఆధునిక మెరుపులు సందడి చేస్తూనే ఉన్నాయి. వాటిలో కుచ్చులు అనబడే ఫ్రిల్‌ శారీ స్టైల్‌ ఒకటి. ∙చీరను కుచ్చిళ్లు పెట్టి కట్టుకుంటాం. అయితే కుచ్చిళ్ల ప్యాటర్న్‌ని ముందే కుట్టి చీరకు జత చేసి, కట్టుకుంటే విభిన్నమైన అందం సొంతం అవుతుంది.∙జార్జెట్, షిఫాన్, సిల్క్, నెటెడ్‌ చీరలకే కాదు కాటన్‌ చీరలకూ ఫ్రిల్స్‌ జత చేసి కొత్త లుక్‌ని తీసుకురావచ్చు. ∙నవతరం అమ్మాయిలే కాదు, నేటి తరం అమ్మలు కూడా వీటిని కట్టుకోవడం ఫ్యాషన్‌ అయ్యింది.∙ఈ స్టైల్‌కి శారీకి పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌  బ్లౌజ్‌ని ఎంచుకోవాలి. ప్లెయిన్, కొద్దిపాటి ఎంబ్రాయిడరీ బ్లౌజులు బాగా నప్పుతాయి. 

 చీరకు కుచ్చులు ఎంపిక చేసుకునేటప్పుడు కాంట్రాస్ట్, సెల్ఫ్‌.. ఏ రంగు నప్పుతుందో ఫ్యాబ్రిక్‌ని బట్టి ఎంపిక చేసుకోవాలి. ఫ్రిల్స్‌ శారీకి రంగుల హంగులు ఎన్నయినా జత చేసుకోవచ్చు.  ప్రింట్‌ శారీ అయితే ప్లెయిన్‌ కుచ్చుల ప్యాటర్న్‌ని, అదే ప్లెయిన్‌శారీ అయితే ప్రింటెడ్‌ కుచ్చులనూ ఎంచుకోవచ్చు.కుచ్చుల ప్యాటర్న్‌ని ముందే కుట్టి, దానిని చీరకు మరో కుట్టుతో ప్యాచ్‌ చేయాలి. ఫ్రిల్‌ శారీకి కుచ్చులే అలంకరణ కాబట్టి ఆభరణాలంటూ ఇతర అలంకరణల హంగులు అవసరం లేదు. ఎంత సింపుల్‌గా ఉంటే అంత బ్రైట్‌గా కనిపిస్తారు. సంప్రదాయ వివాహాది వేడుకలకన్నా కాక్‌టెయిల్‌ పార్టీస్‌కి బాగా నప్పే ఫ్యుజన్‌ లుక్‌ ఇది.
– నిఖిత, డిజైనర్, ఇన్‌స్టిట్యూటో డిజైన్‌ ఇన్నోవేషన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top