ఎనిమిదేళ్ల పిల్లాడి అంతర్జాతీయ ఇమేజ్! | national image | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల పిల్లాడి అంతర్జాతీయ ఇమేజ్!

Feb 26 2014 1:57 PM | Updated on Sep 2 2017 4:05 AM

ఎనిమిదేళ్ల పిల్లాడి అంతర్జాతీయ ఇమేజ్!

ఎనిమిదేళ్ల పిల్లాడి అంతర్జాతీయ ఇమేజ్!

అక్షత్ సింగ్... ‘కలర్స్’ చానల్‌లో ‘ఇండియా గాట్ టాలెంట్-5’ కార్యక్రమం చూసేవారికి పరిచయం ఉన్న బుడ్డోడు.


 అక్షత్ సింగ్... ‘కలర్స్’ చానల్‌లో ‘ఇండియా గాట్ టాలెంట్-5’ కార్యక్రమం చూసేవారికి పరిచయం ఉన్న బుడ్డోడు. ఇతడి వయసు ఎనిమిదేళ్లే కానీ... చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఇతడికి అభిమానులయ్యారు.

 

బీట్‌కు తగ్గట్టుగా ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ మారుస్తూ ఫాస్ట్‌గా డాన్స్ చేసే , బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ బుడ్డోడిని చూసి ఆశ్చర్యపోని వారు ఉండరు. ఆ మధ్య అక్షత్...‘దబంగ్’ సినిమాలోని ‘మేరా హి జల్వా..’ పాటకు చేసిన డాన్స్‌తో అతడి పేరు మారుమోగిపోయింది. ‘కలర్స్’ వాళ్లు ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. దానికి లక్షల కొద్దీ వ్యూలు, వేల కొద్దీ లైకులు వచ్చాయి. ఇక ఆ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతలుగా  వ్యవహరించిన మలైకా ఆరోరాఖాన్‌కి అక్షత్ అంటే చాలా ఇష్టం.  
 

 

దేశవ్యాప్తంగా ఇలాంటి ఫ్యాన్స్‌ను కలిగి ఉన్న అక్షత్‌కు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఒక అమెరికన్ టీవీ చానల్‌లో ప్రసారం అయ్యే ‘ది ఎలెన్ డీజెనెరస్ షో’ లో ఇటీవలే అక్షత్ పాల్గొన్నాడు. షూటింగ్ పూర్తి అయ్యిందికానీ ఆ కార్యక్రమం ఇంకా ప్రసారంకాలేదు. చిన్నారులకు సంబంధించిన ఆ షోలో అక్షత్ అల్లరిని చూడవచ్చు. షో నిర్వాహకురాలు తన  ప్రదర్శనను చూసి సల్మాన్ గురించి వివరాలను అడిగారని అక్షత్ చెప్పాడు. సల్లూ గురించి తెలియని ఎలెన్ ఆయన గురించి చెప్పమని కోరిందని  అక్షత్ వివరించాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement