మిస్డ్ కాల్ బ్యాంకింగ్.. | Missed Call banking .. | Sakshi
Sakshi News home page

మిస్డ్ కాల్ బ్యాంకింగ్..

Jul 4 2014 11:38 PM | Updated on Sep 2 2017 9:48 AM

మిస్డ్ కాల్ బ్యాంకింగ్..

మిస్డ్ కాల్ బ్యాంకింగ్..

మిస్డ్ కాల్ ఇస్తే ఏమిటర్థం? నా దగ్గర బ్యాలెన్స్ లేదు.. కాల్ చేయండనో.. లేదా వీలైనప్పుడు కాల్ చెయ్యమనో అర్థం. అయితే, ప్రస్తుతం బ్యాంకులు ఈ మిస్డ్ కాల్ ఆధారంగా కూడా బ్యాంకింగ్ సర్వీసులు కూడా అందిస్తున్నాయి.

మిస్డ్ కాల్ ఇస్తే ఏమిటర్థం? నా దగ్గర బ్యాలెన్స్ లేదు.. కాల్ చేయండనో.. లేదా వీలైనప్పుడు కాల్ చెయ్యమనో అర్థం. అయితే, ప్రస్తుతం బ్యాంకులు ఈ మిస్డ్ కాల్ ఆధారంగా కూడా బ్యాంకింగ్ సర్వీసులు కూడా అందిస్తున్నాయి. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ రిక్వెస్టు ఇలా రకరకాల సర్వీసులను ఆయా బ్యాంకుల ఫోన్ నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పొందవచ్చు.  

ఈ సర్వీస్‌ను పొందాలంటే మన మొబైల్ నంబరును ముందు బ్యాంకు దగ్గర రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు సర్వీసుకు ఉద్దేశించిన నంబరుకు కాల్ చేయాలి. రింగ్ అయిన తర్వాత కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. కోరిన సర్వీసు వివరాలు 3-5 నిమిషాలలోగా ఎస్సెమ్మెస్ రూపంలో మొబైల్‌కి వస్తాయి. ప్రతి సర్వీసుకోసం ఒక ప్రత్యేక నంబరు ఉంటుంది.

ఉదాహరణకు బ్యాలెన్స్ ఎంక్వైరీకి ఒకటి, మినీ స్టేట్‌మెంట్‌కి మరొకటి ఉండొచ్చు. ఈ సర్వీస్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్, ఐసీఐసీఐ, కర్ణాటక బ్యాంక్ మొదలైనవి ఇలాంటి సేవలు అందిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement