ఒకటి కాదు... రెండుసార్లు! | 'Men's Health' cover page model, a two-time first-person ... Siddharth Malhotra! | Sakshi
Sakshi News home page

ఒకటి కాదు... రెండుసార్లు!

May 7 2014 12:58 AM | Updated on Sep 2 2017 7:00 AM

ఒకటి కాదు... రెండుసార్లు!

ఒకటి కాదు... రెండుసార్లు!

అదేనండీ...కరణ్ జోహర్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాలో కథానాయకుడిగా నటించాడు.

 
 విశేషం
 సిద్ధార్థ మల్హోత్రా తెలుసుకదా?
 అదేనండీ...కరణ్ జోహర్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఫిబ్రవరి 2007 ‘మెన్స్ హెల్త్’ పత్రికకు  కవర్ మోడల్‌గా పనిచేసిన సిద్ధార్థ....కొంత కాలానికి ముంబాయికి వచ్చి ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమాకు కరణ్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. ఆ తరువాత హీరో కూడా అయ్యాడు.


 ఏప్రిల్ 2014 ‘మెన్స్ హెల్త్’ కోసం తాజాగా మరోసారి మోడల్ అవతారం ఎత్తాడు. ‘‘ఈ ఏడు సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చాయి. మొదట్లో ఫోటో షూట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను చేయగలనా అని సందేహించాను. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో ఆత్మవిశ్వాసం వచ్చింది’’ అంటున్నాడు సిద్ధార్థ. విశేషం ఏమిటంటే ‘మెన్స్ హెల్త్’ కవర్ పేజీ మోడల్‌గా రెండు సార్లు చేసిన తొలి వ్యక్తి...సిద్ధార్థ మల్హోత్రా!

Advertisement
 
Advertisement
Advertisement