
మేకప్ ప్యాచ్‌లు కనిపించకుండా...
వయసు పై బడటం వల్ల చర్మం ముడతలు పడుతుంటుంది. మెడ, గొంతు ప్రాంతంలో చర్మం ముడతలు పడడాన్ని, చారికలు రావడాన్ని గమనించవచ్చు.
వయసు పై బడటం వల్ల చర్మం ముడతలు పడుతుంటుంది. మెడ, గొంతు ప్రాంతంలో చర్మం ముడతలు పడడాన్ని, చారికలు రావడాన్ని గమనించవచ్చు. ఈ సమస్య నివారణకు మెడ వ్యాయామం చాలా అవసరం. ఆకాశాన్ని చూస్తున్నట్టుగా తల పైకి ఉంచి, తిరిగి కిందకు దింపాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి.
ఇలా రోజులో 5-6 సార్లు చేస్తూ ఉంటే మెడ దగ్గర చర్మం బిగుతుగా మారుతుంది. అలాగే మెడ, గొంతు దగ్గర మేకప్ వేసుకోవడానికి ముందు ఇలా చేయడం వల్ల మేకప్ ప్యాచ్‌లుగా కనిపించకుండా జాగ్రత్తపడవచ్చు.