లక్కీ ఛాన్స్! | Lucky Chance | Sakshi
Sakshi News home page

లక్కీ ఛాన్స్!

Jun 10 2015 10:47 PM | Updated on Sep 3 2017 3:31 AM

లక్కీ ఛాన్స్!

లక్కీ ఛాన్స్!

ఎనిమిది సంవత్సరాల క్రితం అభిషేక్ కపూర్ డెరైక్షన్‌లో వచ్చిన ‘రాక్ ఆన్’ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది.

 గాసిప్

ఎనిమిది సంవత్సరాల క్రితం అభిషేక్ కపూర్ డెరైక్షన్‌లో వచ్చిన ‘రాక్ ఆన్’ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. ఫర్హాన్ అఖ్తర్, ప్రాచీ దేశాయ్‌లకు మంచి పేరు తెచ్చింది.  సక్సెస్ అయిన ఊపులో ‘రాక్ ఆన్’కు సీక్వెల్ తీసుకు రావడానికి రెండు మూడుసార్లు ప్రయత్నాలు జరిగాయి కానీ ప్రాజెక్ట్ పట్టాలకెక్కలేదు. ఇప్పుడు మాత్రం నిజంగానే ‘రాక్ ఆన్’కు సీక్వెల్ రాబోతుంది. ‘రాక్ ఆన్’లో నటించిన అర్జున్ రాంపాల్, ఫర్హాన్ అఖ్తర్‌లు సీక్వెల్‌లోనూ నటించనున్నారు. అయితే ప్రాచీ దేశాయ్ స్థానంలో శ్రద్ధాకపూర్ నటించనుంది అనే వార్తలు వెలువడుతున్నాయి.

 ఇంతకీ ‘రాక్  ఆన్’ సీక్వెల్‌లో ప్రాచీకి బదులు  శ్రద్ధాకపూర్‌ను ఎందుకు తీసుకుంటున్నట్లు? ప్రాచీతో పోల్చితే శ్రద్ధా సక్సెస్‌లో ఉంది. ఆ సక్సెస్‌ను క్యాష్ చేసుకోవడానికే శ్రద్ధాకపూర్‌ను తీసుకున్నట్లు ఆ నోటా ఈ నోటా వినిపిస్త్తోంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement