
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను.
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను హిందు. నేను ముస్లిం. తను నాతో చాలా క్లోజ్‌గా ఉంటుంది. తనని పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. కానీ చాలాసార్లు నాతో గొడవలు పడింది. అయినా సర్దుకుపోతూ వచ్చా. తనంటే నాకు చాలా ఇష్టం. తను నన్ను లవ్ చేస్తుందో లేదో అర్థం కావడం లేదు. అడిగితే లేదంటుంది. మీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నా. మీ సమాధానాలు చాలా బాగుంటాయి సర్. – షేక్
‘సారీ’ దేనికి నీలాంబరి..? ‘అడగొద్దు.’ జోక్ చేస్తున్నావా..? ‘జోక్ చెయ్యొద్దు.’ ఏడ్చినట్లుంది.! ‘నా ముందు ఏడ్చినా లాభం లేదు’
నేను ఏడవటం లేదు. ‘అంటే నా పరిస్థితి చూసి నవ్వుతున్నారా...?’ సూపర్... నీ పరిస్థితి చెబితే కదా... నవ్వేదైనా ఏడ్చేదైనా..? ‘మీ నర్స్ పరిస్థితి అర్థం చేసుకోలేనంత కఠిన హృదయులయి పోయారన్నమాట.’ నా వల్ల కాదు ఈ డ్రామా భరించలేక పోతున్నా... బై! ‘నర్స్‌కి కష్టం వస్తే తప్పించుకుంటారు.
అంతే. మెన్ ఆర్ , ఆల్వేస్ ఎస్కేపింగ్.. మీరెందుకు నేనే వెళ్తా..!’ చూశావా షేక్ భాయ్...? నా పరిస్థితే ఇలా ఉంది. ఇక నీకు నేను ఏమి చెప్పగలను..? అమ్మాయిని అర్థం చేసుకో..! కిటికీ దగ్గరకు వెళ్లి నీలాంబరిని పిలిచి.. ‘గెల వద్దు.. పండు వద్దు.. తొక్కా వద్దు.. నువ్వు లేకపోతే ముక్క రాయలేను.. ప్లీజ్ కమ్ బ్యాక్..!’ అన్నా. నీలాంబరి అబౌట్ టర్న్ కొట్టి చెంగు చెంగున వచ్చి అరటిపండు ఇచ్చింది..!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com