నన్నడగొద్దు ప్లీజ్‌

love doctor solve the problems - Sakshi

హలో సార్‌! నేను బీటెక్‌ చదువుతున్నా. సెకండ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు నాకు ఒక అబ్బాయి పరిచయమయ్యాడు. అప్పటికే తను జాబ్‌ చేస్తున్నాడు. తనంటే నాకు ఫస్ట్‌ నుంచీ ఇష్టమే. అయితే ఆ విషయం తనకి చెప్పలేదు. కానీ తనే తెలుసుకుని.. ‘‘ఇదంతా కుదరదు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నా మరదల్ని చేసుకోవాలి తప్పదు.’’ అన్నాడు. ఎందుకలా అని అడిగితే.. ‘‘మేము వర్జిన్స్‌ కాదు’’ అన్నాడు. నేను సైలెంట్‌ అయిపోయా. కొన్ని రోజలకు మళ్లీ తనే వచ్చి.. ‘‘నువ్వు లేకుండా నేను ఉండలేను’’ అన్నాడు. మరి మీ మరదలూ..? అని అడిగితే.. ‘‘ఆ రోజు మా మధ్య ఏం జరగలేదు. నాకు మత్తు మందు ఇచ్చి, లేచేసరికి అరచి గోల చేసి నన్ను బుక్‌ చేసింది.  నువ్వు నాకు కావాలి. మనం పెళ్లి చేసుకుందాం. తనకి తరువాత నేనే పెళ్లి చేస్తాలే’’ అన్నాడు. నేను కాదనలేకపోయా. కొన్ని రోజులకు వచ్చి.. ‘‘నాకు పెళ్లి ఫిక్స్‌ అయ్యింది. మా నాన్న బలవంతం మీద ఈ పెళ్లి జరుగుతుంది’’ అన్నాడు. పెళ్లి అయిపోయిన తరువాత వచ్చి.. ‘‘నాకు నువ్వే కావాలి. నేను ఆ అమ్మాయిని నా భార్యగా అంగీకరించలేకపోతున్నా’’ అంటున్నాడు. కాదంటే చచ్చిపోతా అంటున్నాడు. ఇప్పటికే చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పండి ప్లీజ్‌.
– డింపు 

వాడొక పిచ్చోడు.
‘ప్రేమ పిచ్చోడా సార్‌?’
పిచ్చికి పిచ్చెక్కితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు...!
‘ప్రేమకు ప్రేమెక్కినట్టు అనిపించలేదా సార్‌???’
అసలు వాడికి ప్రేమంటే ఏంటో తెలియదు.
పెళ్లంటే గౌరవం లేదు.
అమ్మాయంటే విలువ లేదు.
‘అలా ఎలా చెప్పగలరు సార్‌?’
ప్రేమించిన అమ్మాయిని వదిలేశాడు...
పెళ్లి చేసుకున్న అమ్మాయినీ వదిలేశాడు..
రేపు డింపునీ వదిలేస్తాడు..
తాడూ బొంగరం లేని పిచ్చోడు..
వాడి చేతిలో ప్రేమ ఒక రాయి లాంటిది.
ఎటు విసురుతాడో....
ఎవరి జీవితాన్ని పగలగొడతాడో తెలియదు.
డింపు... ప్లీజ్‌ బీ కేర్ఫుల్‌!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top