నన్నడగొద్దు ప్లీజ్‌ | Love Doctor Returns | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Apr 10 2017 12:53 AM | Updated on Sep 5 2017 8:22 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

రామ్‌ సార్‌! నేను టూ ఇయర్స్‌ క్రితం మా క్లాస్‌మేట్‌కు ప్రపోజ్‌ చేశాను. ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ బ్రేక్‌ అప్‌ చెప్పాడు.

రామ్‌ సార్‌! నేను టూ ఇయర్స్‌ క్రితం మా క్లాస్‌మేట్‌కు ప్రపోజ్‌ చేశాను. ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ బ్రేక్‌ అప్‌ చెప్పాడు. ఎందుకు అని అడిగితే...‘మా ఇంట్లో ఉన్న పరిస్థితులకు నువ్వు ఉండలేవు, నీ మంచి కోసమే’ అన్నాడు. నేను ఎవరినీ ఫోర్స్‌ చేసే టైప్‌ కాదు. సో ఇంక వదిలేశాను. కానీ 6 నెలల క్రితం తనని ఒకసారి కలవమని తన ఫ్రెండ్‌తో కబురు పంపించాడు. కుదరదు అని చెప్పేశాను. అంతే, ఇప్పటిదాకా ఇంకేం జరగలేదు. ఒకవేళ ఫ్యూచర్‌లో తను వస్తే నేను ఒప్పుకోవాలా? లేక వదిలెయ్యాలా? ఏం చెయ్యాలి సర్‌?
– అనామిక


‘సార్‌... మామిడి పండ్లు వచ్చాయి. మార్కెట్‌ అంతా పచ్చగా కళకళలాడుతోంది... ఇవ్వాళ అరటి పండు బదులు మామిడి పండు?’ అని అడిగింది నీలాంబరి. ‘నేను ఒక్కసారి అరటి పండు తింటే వందసార్లు అరటి పండ్లు తిన్నట్లే... నో మాంగో... ఓన్లీ బనానా’...‘అంతేనా సార్‌... ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మార్చకూడదా?’‘అదే మన క్యారెక్టర్‌... అదే మన స్ట్రెంగ్త్‌...’వాళ్ల ఇంట్లో పరిస్థితి బాగుండదని చెప్పి తప్పించుకున్నవాడు ఇప్పుడు నో ప్రాబ్లమ్‌ అనగానే గంతులేసుకుంటూ పోతే మనకు రెస్పెక్ట్‌ ఏముంటుంది? పోనీ లవ్‌ చేశాం కాబట్టి ఇప్పుడు ఓకే అంటే... రేపు మళ్ళీ మాట మారిస్తే..? అందుకే కెరీర్‌ మీద కాన్సన్‌ట్రేషన్‌ పెట్టి హ్యాపీగా ఉండు బంగారం.
‘మీరు మాంగోని వదిలి, అరటిపండు మీద కాన్సన్‌ట్రేట్‌ చేసినట్లా సార్‌’... అని నవ్వింది నీలాంబరి.

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే
ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,
రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement