నన్నడగొద్దు ప్లీజ్‌ | Love Doctor Returns | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Mar 30 2017 12:05 AM | Updated on Sep 5 2017 7:25 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ సర్, నా పేరు కృష్ణ. త్రీ ఇయర్స్‌ నుంచి నేను ఒక ప్రాబ్లమ్‌ ఫేస్‌ చేస్తున్నాను.

లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌

హాయ్‌ సర్, నా పేరు కృష్ణ. త్రీ ఇయర్స్‌ నుంచి నేను ఒక ప్రాబ్లమ్‌ ఫేస్‌ చేస్తున్నాను. నాకొక బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉన్నాడు. వాడి పేరు గోపి. వాడికి ఒక చెల్లి ఉంది. అనుకోకుండా నేను ఆ అమ్మాయితో లవ్‌లో పడ్డాను. ఆ అమ్మాయి కూడా నన్ను లవ్‌ చేసింది. వాళ్ల ఇంట్లో విషయం తెలిసి వాళ్ల అమ్మ తిట్టింది. కానీ నా ఫ్రెండ్‌ ఏమీ అనలేదు. దాంతో ఫ్రెండ్‌షిప్‌కి విలువిచ్చి ఆ అమ్మాయిని వదిలేశాను. కానీ సంతోషంగా ఉండలేకపోతున్నా. వేరే అమ్మాయి నచ్చి తనతో మాట్లాడుతుంటే ముందు అమ్మాయే గుర్తుకొస్తోంది.

త్రీ ఇయర్స్‌గా తనని చూడలేదు సర్‌. ఈ మధ్యే ఒకసారి మనస్ఫూర్తిగా ఆమె వైపు చూశాను. గుండె ఆగిపోయింది. ఆ కొంచెం సేపు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది గురూ. ఇంక నాకు అర్థమయ్యింది తను నాదే అని. కానీ ఏం చెప్పి నా ఫ్రెండ్‌ని ఒప్పించాలో అర్థం కావడం లేదు బ్రో. ఇప్పుడు అమ్మాయి కూడా నన్ను లవ్‌ చేస్తుందని చెప్పలేను. ఏం చేయాలి బ్రో..?  – కృష్ణ


‘ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుకున్నా టిన్‌..టిన్‌.. టిన్‌.. టిన్‌... నీ సుఖమే నే కోరుకున్నా టటటటయ్‌......... నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా ఫ్రెండ్‌ సిస్టర్‌ అని తెలియక నువ్వు లవ్‌ స్టోరీతో దరి చేరినావు ఫ్రెండ్‌ సిస్టర్‌ అని తెలిసాకా... ఫ్రెండో.. సిస్టరో.. తేల్చుకోలేక నువ్వు నెత్తినోరూ కొట్టుకున్నావు ఆల్‌ ఈజ్‌ ఓకే, కానీ... లవ్‌ డాక్టర్‌కి ఎందుకు రాస్తున్నావు..’ అంటూ... కూనిరాగాలు తీస్తోంది నీలాంబరి నా అరటి పండు తింటూ. నాకు ముక్క అర్థం కాలేదు. నీకు ఏమైనా అర్థమయ్యిందా, సర్, గురు, బ్రో.. కృష్ణ? ఇంకా అర్థంకాకపోతే... ఈ లింకేస్కో... https://www.youtube.com/watch?v=VkQRUi1UGjw
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement