నెయ్యి రాస్తే... సాయంత్రానికీ నిల్వ! | kitchen tips for chapathy's and vegitables | Sakshi
Sakshi News home page

నెయ్యి రాస్తే... సాయంత్రానికీ నిల్వ!

Aug 28 2016 12:11 AM | Updated on Sep 4 2017 11:10 AM

నెయ్యి రాస్తే... సాయంత్రానికీ నిల్వ!

నెయ్యి రాస్తే... సాయంత్రానికీ నిల్వ!

క్యాబేజీ వండేటప్పుడు కాసిన్ని సోంపు గింజలు వేస్తే పచ్చి వాసన రాకుండా ఉంటుంది.

• క్యాబేజీ వండేటప్పుడు కాసిన్ని సోంపు గింజలు వేస్తే పచ్చి వాసన రాకుండా ఉంటుంది.

• బెండకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... రెండు వైపులా తొడిమలు కోసేసి, పాలిథీన్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.

• మసాలా గ్రైండ్ చేసిన తర్వాత మిక్సీ జార్ అదే వాసన వస్తూ ఉంటే... కొన్ని బ్రెడ్ ముక్కలు కానీ రస్కులు కానీ వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేస్తే సరి.

• టీ మరిగించే పాత్రలు నల్లబడిపోతుంటాయి. అవి మళ్లీ తళతళలాడాలంటే ఉప్పుతో రుద్ది కడగాలి.

• కేక్ కట్ చేసే ముందు చాకుని వేడి నీటిలో ముంచి తీసి, బట్టతో తుడిచి అప్పుడు కోస్తే... కేక్ అందంగా తెగుతుంది. 

• చపాతీలు సాయంత్రం వరకూ ఎండిపోకుండా మెత్తగానే ఉండాలంటే... వాటికి కొద్దిగా నెయ్యి రాసి, పాలిథీన్ కవర్‌లో పెట్టి ఉంచాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement