కపిల్ కోతి గంతులు | Kapil Sharma denies misbehaving with Marathi actress | Sakshi
Sakshi News home page

కపిల్ కోతి గంతులు

Nov 21 2015 11:36 PM | Updated on Sep 3 2017 12:49 PM

కపిల్ కోతి గంతులు

కపిల్ కోతి గంతులు

కలర్స్ టీవీలో ప్రతి ఆదివారం కామెడీ నైట్స్ విత్ కపిల్ పేరుతో కడుపుబ్బ నవ్వించే కామెడీ కింగ్ కపిల్ శర్మ కంటతడి పెట్టుకునే సీన్ క్రియేట్ అయింది.

గాసిప్
కలర్స్ టీవీలో ప్రతి ఆదివారం కామెడీ నైట్స్ విత్ కపిల్ పేరుతో కడుపుబ్బ నవ్వించే కామెడీ కింగ్ కపిల్ శర్మ కంటతడి పెట్టుకునే సీన్ క్రియేట్ అయింది. మొన్నీమధ్య జరిగిన ఇంటర్నేషనల్ మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఫంక్షన్‌కి కపిలూ హాజరయ్యాడట. మస్తుగా మందుకొట్టి కల్లు తాగిన కోతిలా గంతులేశాడట. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ పిచ్చి వాగుడు వాగాడట. ఆ మైకంలోనే అక్కడే ఉన్న మరాఠీ నటి దీపాలీ సయ్యద్ చేయిపట్టుకొని డాన్స్ చేయబోయాడట. సోయి తప్పిన కపిల్‌ని కొట్టినంత పని చేసిందట ఆమె.

పరిస్థితి శృతిమించుతోందని గమనించిన  టీవీ యాక్టర్ శరత్‌కేల్కర్ కపిల్‌ని అక్కడి నుంచి తీసుకెళ్లడానికీ ప్రయత్నించాడనీ నేషనల్ మీడియాలో ప్రచారం. అయితే కపిల్ మాత్రం ఇదంతా శుద్ధ అబద్ధం.. నేనంటే గిట్టని వాళ్లు నా మీద చేస్తున్న దుష్ర్పచారమని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. అసలు నేనా ఫంక్షన్‌కే వెళ్లనే లేదు.. అదెప్పుడు జరిగిందో కూడా తెలియదు.

ఇదంతా ఎవరు కల్పించారో తెలియదు. ఏమైనా దీని వల్ల నేనో పాఠం నేర్చుకున్నాను.. అందరూ నాలాగే ఉంటారనుకోవడం తప్పని. మనతో బాగా మాట్లాడిన వాళ్లందరినీ మనవాళ్లు అనుకోకూడదని’ అంటూ వాపోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement