breaking news
Colours TV
-
23 నుంచి ‘కోటీశ్వరి’ వచ్చేస్తోంది..
సాక్షి, చెన్నై: మహిళల కోసం ప్రత్యేకంగా ఓ గేమ్ షోను కలర్స్ తమిళ చానల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ షోలో విజేతగా నిలిచే వారికి రూ. కోటి చెక్కును పరిచయం చేస్తూ నటి రాధికా శరత్‌కుమార్, కలర్స్ చానల్ తమిళ్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈనెల 23వ తేదీ రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ టీవీ చానల్లో నటి రాధికా వ్యాఖ్యాతగా (హోస్ట్‌గా) వ్యవహరించనున్న కోటీశ్వరి గేమ్ షో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షో ప్రసారం అవుతుంది. కలర్స్ తమిళ టీవీ చానల్, స్టూడియో నెక్ట్స్ సంయుక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కలర్స్ చానల్ వ్యాపారాధ్యక్షుడు అనూప్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహిళల ప్రతిభకు అద్దంపట్టే రీతిలో కోటీశ్వరి గేమ్ షో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాధికా శరత్ కుమార్ 15 ప్రశ్నలు వేస్తారని, వాటికి రూ. 1000 నుంచి రూ. 1 కోటి బహుమతి ఉంటుందని అన్నారు. పోటీదారులు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే రూ. కోటి బహుమతి గెలుచుకోవచ్చని తెలిపారు. గేమ్ ఆడే సమయంలో పోటీ దారులు 50కి 50 శాతం, ఆడియన్స్ పోల్, ఆస్క్ ది ఎక్స్‌పోల్ (నిపుణుల వద్ద సమాధానాలు కోరడం), ప్లిప్ (కొన్ని సమాధానాలలో ఒకదాన్ని ఎంపిక చేయడం) వంటి నాలుగు విధాలైన హెల్ప్లైన్లు ఉంటాయని వివరించారు. ఈ గేమ్‌షోలో పాల్గొనడం కోసం ఇప్పటి వరకు 3,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. -
కపిల్ కోతి గంతులు
గాసిప్ కలర్స్ టీవీలో ప్రతి ఆదివారం కామెడీ నైట్స్ విత్ కపిల్ పేరుతో కడుపుబ్బ నవ్వించే కామెడీ కింగ్ కపిల్ శర్మ కంటతడి పెట్టుకునే సీన్ క్రియేట్ అయింది. మొన్నీమధ్య జరిగిన ఇంటర్నేషనల్ మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఫంక్షన్‌కి కపిలూ హాజరయ్యాడట. మస్తుగా మందుకొట్టి కల్లు తాగిన కోతిలా గంతులేశాడట. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ పిచ్చి వాగుడు వాగాడట. ఆ మైకంలోనే అక్కడే ఉన్న మరాఠీ నటి దీపాలీ సయ్యద్ చేయిపట్టుకొని డాన్స్ చేయబోయాడట. సోయి తప్పిన కపిల్‌ని కొట్టినంత పని చేసిందట ఆమె. పరిస్థితి శృతిమించుతోందని గమనించిన టీవీ యాక్టర్ శరత్కేల్కర్ కపిల్‌ని అక్కడి నుంచి తీసుకెళ్లడానికీ ప్రయత్నించాడనీ నేషనల్ మీడియాలో ప్రచారం. అయితే కపిల్ మాత్రం ఇదంతా శుద్ధ అబద్ధం.. నేనంటే గిట్టని వాళ్లు నా మీద చేస్తున్న దుష్ర్పచారమని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. అసలు నేనా ఫంక్షన్‌కే వెళ్లనే లేదు.. అదెప్పుడు జరిగిందో కూడా తెలియదు. ఇదంతా ఎవరు కల్పించారో తెలియదు. ఏమైనా దీని వల్ల నేనో పాఠం నేర్చుకున్నాను.. అందరూ నాలాగే ఉంటారనుకోవడం తప్పని. మనతో బాగా మాట్లాడిన వాళ్లందరినీ మనవాళ్లు అనుకోకూడదని’ అంటూ వాపోతున్నాడు.