ఒబేసిటీకి మంచి మందులున్నాయి...
నా వయసు 28 సంవత్సరాలు. ఈ మధ్య విపరీతంగా జుట్టు రాలుతూ, బరువు పెరుగుతూ ఉంటే పరీక్షలు
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 28 సంవత్సరాలు. ఈ మధ్య విపరీతంగా జుట్టు రాలుతూ, బరువు పెరుగుతూ ఉంటే పరీక్షలు చేయించుకున్నాను. థైరాయిడ్, పీసీఓడీ అన్నారు. ముఖ్యంగా బరువు తగ్గితే వీటికి పరిష్కారం లభిస్తుందన్నారు. దయచేసి స్థూలకాయానికి హోమియోలో పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పగలరు. - జి.పి.లత, హైదరాబాద్
ఒబేసిటీ లేదా ఊబకాయం అనేది ఈ మధ్యకాలంలో తరచు వినిపిస్తున్న సమస్య. స్థూలకాలయం అతి సాధారణంగా కనిపిస్తున్న జీవక్రియల సమస్య. ఆధునిక జీవనశైలి తెస్తున్న ముప్పుల్లో స్థూలకాయం ముందు వరుసలో ఉంది. చర్మం కింద, వివిధ రకాల అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల కనిపించే ఈ మెటబాలిక్ డిజార్డర్‌తో బాధపడుతున్న వాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. సరైన పోషకాహారం లోపించడం, శారీరక శ్రమ లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణాలవుతున్నాయి. ఒబేసిటీ ఉందా లేదా అనే దాన్ని బాడీమాస్ ఇండెక్స్ ద్వారా నిర్థారిస్తారు. బీఎమ్‌ఐ 5 శాతం కంటే తక్కువ ఉన్నవారు తక్కువ బరువున్న వ్యక్తుల కేటగిరీకి చెందుతారు. బీఎంఐ 5 శాతం కంటే ఎక్కువ, 95 శాతం కంటే తక్కువ ఉంటే అధిక బరువుగానూ, 95 శాతం కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒబేసిటీతో బాధపడుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఒబేసిటీ కి అనుబంధంగా షుగర్, కొలెస్ట్రాల్, హృద్రోగం వంటి అనేక ఇతర సమస్యలు కనిపిస్తాయి. ఒబేసిటీని తగ్గించుకుంటే సగం సమస్యలు తగ్గుతాయని చెప్పొచ్చు.
సాధారణంగా బరువు పెరగడం అనేది 20-40 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రోజూ తీసుకునే ఆహారంలో ఉండే కేలరీలు శరీరానికి అవసరమైనంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు అవి శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది అందరినీ వేధిస్తున్న సమస్య. ఇండియాలో 5 శాతం మంది దీనితో బాధపడుతున్నారు.
కారణాలు: జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల సమస్యలు, వంశపారంపర్యం, ఫాస్ట్‌ఫుడ్స్ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, టీవీ కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడపడం, అధికంగా స్వీట్స్, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం.
నిర్ధారణ: బీఎంఐ.
హోమియో చికిత్స: ఊబకాయానికి గల కారణాన్ని గుర్తించి చికిత్స చేయడం ముఖ్యం. హోమియోపతిలో ఒబేసిటీకి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి శారీరక, మానసిక, వంశపారంపర్య తత్వాలను విశ్లేషించి చికిత్స చేయడం జరుగుతుంది. ఒబేసిటీ ఉన్నవారికి హోమియోలో కాల్కేరియా కార్బ్, ఫైటోలెక్కా బెర్రి, కాప్సికం, ఫై, కాలికార్బ్, గ్రాఫైటిస్, యాంటిమోనియం క్రూడ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వైద్యుని పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి హైదరాబాద్


