హీరోయిన్ల్ కొత్త అందాలు | heroines new fashion show | Sakshi
Sakshi News home page

హీరోయిన్ల్ కొత్త అందాలు

Oct 6 2016 10:42 PM | Updated on Sep 4 2017 4:25 PM

ఎక్కడైనా పట్టు విడుపు ఉండాలి కానీ, ఇలాంటి చీరలు చూస్తే పట్టు కట్టు తప్పదు. ఈ పండగ మీద ఒట్టు మీ ఆవిడకో పట్టు నువ్వు తప్పకుండా కట్టు.

పండగ పట్టు
 
ఎక్కడైనా పట్టు విడుపు ఉండాలి  కానీ,  ఇలాంటి చీరలు చూస్తే  పట్టు కట్టు తప్పదు.  ఈ పండగ మీద ఒట్టు  మీ ఆవిడకో పట్టు
 నువ్వు తప్పకుండా కట్టు.

►పట్టు చీరకు బుట్ట చేతుల సింగారం. నీలాకాశానికి బంగారు, గులాబీ రంగులు చేర్చిన వన్నెల నయగారం. పండగ రోజున కోటి కాంతుల సోయగాన్ని మోసుకువచ్చే కాంబినేషన్ కట్టుతో నటి, కాజల్.

 ►అచ్చమైన జిలుగుల కళ కంజీవరం పట్టు ప్రత్యేకం.  వెలుగుల కళలు పండగ వేళకు ప్రత్యేకం. కంచిపట్టు చీరతో సింపుల్‌గా అనిపిస్తూనే గ్రాండ్ లుక్‌తో కట్టిపడేస్తున్న నటి, సమంత.

 ►ప్లెయిన్ చిలకపచ్చ పట్టు చీరకు పూర్తి కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ సరైన ఎంపిక. పండగ వేళ ఓ కొత్త కళగా ఆకట్టుకుంటున్న కాంబినేషన్‌తో  నటి రకుల్ ప్రీత్‌సింగ్.

 ►సంప్రదాయ కట్టుకు పట్టు పండగలో ఓ వెలుగు. కళ తెచ్చే రంగులు, జరీ హంగులతో వెలిగిపోతున్న నటి నందిత.

 ►రెట్రో స్టైల్: 1940 సంవత్సరం కాలం నాటి కళ నేటికీ ఎవర్‌గ్రీన్ అని చాటుతూనే ఉంది. ఉప్పాడ పట్టు శారీకి కాంట్రాస్ట్ డిజైనర్ ప్లెయిన్ బ్లౌజ్ ఓ ప్రత్యేక ఆకర్షణకు ఉదాహరణగా నిలిచిన నటి, రెజీనా!
 
►కంజీవరం జరీ కాంతులు పండగవేళ మేని మెరుపుతో పోటీపడితే రెట్టింపు సందడి నట్టింటికి విచ్చేసినట్టే. స్లీవ్‌లెస్ బ్లౌజ్, మిరపపండు చీరను మెరిపించే జరీకాంతులతో నటి  రాశీఖన్నా!

 ►మస్టర్డ్ కలర్ శారీకి మెరూన్ అంచు పండగ ప్రత్యేకతను నిలిచే కట్టు. డిజైనర్ బ్లౌజ్ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్న నటి నదియా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement