బ్రేక్‌లో బటర్‌ చికెన్‌  | Heroine hansika cooking | Sakshi
Sakshi News home page

బ్రేక్‌లో బటర్‌ చికెన్‌ 

Jun 1 2018 12:22 AM | Updated on Aug 20 2018 3:40 PM

Heroine hansika cooking  - Sakshi

షూటింగ్‌కు హాలీడేనో లేక స్వయంపాకం తినాలనుకున్నారో కానీ హీరోయిన్‌ హాన్సిక గెరిట పట్టి చెఫ్‌గా మారిపోయారు. కిచెన్‌లోకి వెళ్లి వంట వండారు. ఇంతకీ ఏం చేశారనుకున్నారు?! బటర్‌ చికెన్‌! టేస్ట్‌ గురించి అడక్కండి. ఎందుకంటే అది హాన్సికకు మాత్రమే తెలుసు. ఖాళీ టైమ్‌లో కిచెన్‌లోకి వెళుతున్నారు సరే. మరి..లొకేషన్‌లో కెమెరా ముందుకు వెళ్లడం లేదా అంటే.. ఎందుకు లేదూ? ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

మరికొన్ని సినిమాల కోసం డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆథర్వ హీరోగా హాన్సిక కథానాయికగా నటిస్తోన్న సినిమాకు ‘100’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను డైరెక్టర్‌ మురగదాస్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో హీరో ఆథర్వ పోలీసాఫీసర్‌ రోల్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement