
స్మార్ట్‌ఫోన్లతో మరింత సులువుగా పనిచేసేందుకు సిరి, కోర్టానా, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్లు ఎంతో ఉపయోగపడతాయి. కానీ ఇప్పటివరకూ చాలావరకూ వాయిస్ అసిస్టెంట్లు ఇంగ్లిష్ భాషకు మాత్రమే స్పందిస్తాయి. అయితే ఏడాది తిరిగేలోగా ఈ పరిస్థితి మారిపోనుంది. ఎందుకంటే హిందీతోపాటు దాదాపు 30 ఇతర భాషల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ సిద్ధమవుతోంది మరి!
కత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ వాయిస్ అసిస్టెంట్లు అవసరమైతే మన మెయిళ్లు ఓపెన్ చేసి కొత్త మెయిల్స్‌ను చదివి వినిపించడంతోపాటు.. అన్ని రకాల సందేహాలను వికీపీడియా లేదా ఇతర మార్గాల ద్వారా తీరుస్తాయి. ప్రస్తుతం ఇంగ్లిష్‌కు మాత్రమే పరిమితమైన గూగుల్ అసిస్టెంట్‌ను ఏడాది తిరిగేలోగా డానిష్ భాషతోపాటు డచ్, హిందీ, ఇండోనేసియన్, నార్వీజియన్, స్వీడిష్ భాషల్లో అందుబాటులోకి తెస్తామని దీనిద్వారా ఆండ్రాయిడ్‌ను ఉపయోగించే వారిలో 95 శాతం మందికి వాయిస్ అసిస్టెంట్ లభిస్తుందని గూగుల్ ప్రతినిధి ఒకరు చెప్పారు.