రారండోయ్‌

events in hyderabad - Sakshi

జలజం సత్యనారాయణ అనుసృజన ‘కబీర్‌ గీత’ ఆవిష్కరణ ఏప్రిల్‌ 30న సాయంత్రం 5 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది.

నిర్వహణ: ధ్వని ప్రచురణలు, మహబూబ్‌నగర్‌.

మల్లిపురం జగదీశ్‌ కథాసంపుటి ‘గురి’ ఆవిష్కరణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పార్వతీపురంలో జరగనుంది.

ప్రచురణ: స్నేహ కళాసాహితి.

శ్రీశ్రీ జయంతి సభ ఏప్రిల్‌ 30న విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో సాయంత్రం 5:30కు  జరగనుంది.

నిర్వహణ: మొజాయిక్‌ సాహిత్య సంస్థ

శ్రీశ్రీ జయంతి సభ ఏప్రిల్‌ 30న నెల్లూరు, టౌన్‌హాల్‌లో సాయంత్రం 7 గంటలకు జరగనుంది.

నిర్వహణ: శ్రీశ్రీ ప్రగతి ట్రస్టు, నెల్లూరు.

కవిత–2017 ఆవిష్కరణ మే 1న విజయవాడలోని శిఖర స్కూల్లో సాయంత్రం 6 గంటలకు జరగనుంది.

సంపాదకులు: కొండేపూడి నిర్మల, జి.లక్ష్మీనరసయ్య. నిర్వహణ: సాహితీ మిత్రులు.

ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ రచన ‘భాష–భాషాభివృద్ధి’ ఆవిష్కరణ, మండలి బుద్ధప్రసాద్‌కు అంకితోత్సవం మే 1న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరగనున్నాయి. 

39 మంది కవుల ‘ఒక జ్ఞాపకం’ పుస్తకావిష్కరణ మే 3న మధ్యాహ్నం 2 గంటలకు నల్లగొండ లయన్స్‌ క్లబ్‌ భవనంలో జరగనుంది.

ఎండ్లూరి మానస కథా సంపుటి ‘మిళింద’ ఆవిష్కరణ మే 5న సాయంత్రం 5 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనుంది.

నిర్వహణ: ఛాయా రిసోర్స్‌ సెంటర్, రోష్ని ప్రచురణలు.

కవి శివారెడ్డిపై అచ్చయిన కవితలతో తేనున్న సంకలనానికి కవితలను పంపాలని సంపాదకులు కోరుతున్నారు.  మెయిల్‌: ethakotas@yahoo.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top