కట్ అండ్ పేస్ట్ | doctors and surgens do cut and paste for waste oparations | Sakshi
Sakshi News home page

కట్ అండ్ పేస్ట్

Apr 28 2016 12:30 AM | Updated on Oct 9 2018 6:34 PM

కట్ అండ్ పేస్ట్ - Sakshi

కట్ అండ్ పేస్ట్

ఎక్కువగా మీడియాలో ఉపయోగించే పదబంధం ఇది. కంప్యూటర్లు వచ్చాక బాగా ప్రాచుర్యం పొందింది.

మెడిక్షనరీ
ఎక్కువగా మీడియాలో ఉపయోగించే పదబంధం ఇది. కంప్యూటర్లు వచ్చాక బాగా ప్రాచుర్యం పొందింది. సొంత కథనమేదీ రాయకుండా ఎక్కడిదో సమాచారాన్ని యథాతథంగా ఎత్తేసి, కావలసిన చోట అతికించేసే ప్రక్రియను ఇలా అంటారు. వైద్య పరిభాషలోనూ ‘కట్ అండ్ పేస్ట్’ అనే పదబంధాన్ని వాడుతుంటారు. అయితే, వేరే అర్థంలో వాడుతుంటార్లెండి. మిడిమిడి జ్ఞానం గల సర్జన్లు రోగికి ఏమైందో సరిగా తెలుసుకోకుండానే అర్జంట్‌గా ఆపరేషన్ చేసేస్తుంటారు. ఇలాంటి ఆపరేషన్లలో కోత కోసిన తర్వాత రోగికి చేయాల్సిందేమీ లేదని తాపీగా తెలుసుకున్నాక, గుట్టుచప్పుడు కాకుండా కోసినంత మేరా కుట్టేసి, ఆ తర్వాత కోత గాయం తగ్గడానికి మందులు మాకులు ఇస్తారు. ఇలాంటి అనవసరపు ఆపరేషన్లనే ‘కట్ అండ్ పేస్ట్’ అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement