పెళ్లికి  పూలొచ్చాయి | Decorations of the flowers in the house bring beauty to the stage | Sakshi
Sakshi News home page

పెళ్లికి  పూలొచ్చాయి

Mar 1 2019 12:47 AM | Updated on Mar 1 2019 12:47 AM

Decorations of the flowers in the house bring beauty to the stage - Sakshi

పెళ్ళిళ్లలో పువ్వుల అలంకారాలు వేదికకు అందం తెస్తాయి.పెళ్లికి పూలే నడిచొస్తేప్రాంగణమే పూల పల్లకి అవుతుంది.పెళ్లికి వెళ్లండి..పూలకరించండి.

►ప్రముఖ జాతీయ ఫ్యాషన్‌ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జి పువ్వుల ప్రింట్లున్న ఫ్యాబ్రిక్స్‌తో వేడుకకు తీసుకొచ్చిన కొత్త హంగుల దుస్తులు.

►రా సిల్క్, నెటెడ్‌ కాంబినేషన్‌ లెహెంగా వేడుకకు ఎవర్‌గ్రీన్‌ అయితే, దాని మీద పువ్వుల హంగులు కొత్త సింగారాలనుఅద్దుకున్నాయి.

►వివాహ వేడుక అనగానే  పట్టు దుస్తుల వైపుగా ఎంపికలు మొదలుపెడతారు. కానీ, ఇలా పువ్వుల విరిబోణిలా కనిపించేదే అరుదైన అందం.

►పువ్వుల ప్రింట్లు ఉన్న నెటెడ్‌ ఫ్యా్రబ్రిక్‌ను లెహంగాకు ఎంచుకొని, దానికి ప్లెయిన్‌ రా సిల్క్‌ క్రాప్‌టాప్, నెటెడ్‌ దుపట్టాను ను జత చేస్తే వేడుకలో హైలైట్‌.

►క్రీమ్‌ కలర్‌ నెటెడ్‌ ఫ్యాబ్రిక్‌ మీద ప్రింట్లు, ఎంబ్రాయిడరీ చేసిన పువ్వులు కొత్త అందాలను సింగారించుకున్నాయి. 

►ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ దుస్తులకు పువ్వుల హంగామాలు జత అవ్వాలి. అందుకు ఫ్లోరల్‌ ప్రింట్‌ ఉన్న లెహంగా, క్రాప్‌టాప్‌ ధరిస్తే చాలు గెట్‌ టు గెదర్‌ పార్టీకి గ్రాండ్‌ లుక్‌ వస్తుంది.

►పువ్వుల ప్రింట్లు ఉన్న క్రేప్‌ సిల్క్‌ మెటీరియల్‌తో డిజైన్‌ చేసిన లెహంగా, దానికి పువ్వుల రంగులో నెటెడ్‌ దుపట్టా, స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ జత చేస్తే వచ్చే అందమే వేరు.

►టాప్‌ టు బాటమ్‌ ముదురు నీలం రంగు లంగా ఓణీ ఓ ఆకర్షణ అయితే, దాని మీద ఒదిగిన పువ్వుల జిలుగులు వేడుకలో వేల రెట్లు కాంతులే.

►మఖమల్‌ క్లాత్‌ అంటేనే గ్రాండ్‌నెస్‌కు సిసలైన చిరునామా. మెరూన్‌ కలర్‌ వెల్వెట్‌ ఫ్యాబ్రిక్‌ మీద బంగారు, వెండి జరీ పువ్వుల వెలుగులు వేడుకంతా సందడి చేస్తూనే 
ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement