కోవిడ్‌–19 లవ్‌స్టోరీ

Covid 19 Love Story Of Haryana Boy And Mexican Girl - Sakshi

అబ్బాయి నల్లగా ఉన్నాడు. అమ్మాయి తెల్లగా ఉంది. ప్రేమకు నలుపూ తెలుపుల భాష తెలీదు. అబ్బాయిది.. ఈ తూరుపు. అమ్మాయిది.. ఆ పడమర. ప్రేమకు దిక్కూమొక్కుల భాష తెలీదు. కళ్లు పలికే భావాలే ప్రేమకు తెలిసిన భాష. లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ యాప్‌లో పరిచయం. లాక్‌డౌన్‌లో స్పెషల్‌ పర్మిషన్‌తో పరిణయం.  కోవిడ్‌–19 లవ్‌స్టోరీ ఇది. 

నిరంజన్‌ కశ్యప్‌ లోకల్‌. హర్యానాలోని రోహ్‌తక్‌ లో సూర్యాకాలనీలో ఉంటాడు. నాలుగు భాషలు నేర్చుకుంటే లైఫ్‌ ఉంటుందని ‘లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ యాప్‌’ని డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఇప్పుడు కాదు. మూడేళ్ల క్రితం. ‘మగధీర’ సినిమాలో కాలభైరవుడికి కాజల్‌ అగర్వాల్‌ కనెక్ట్‌ అయినట్లు.. నిరంజన్‌కి ఓ మెక్సికో అమ్మాయి లిపిలేని కంటి భాషతో టచ్‌ అయింది. అందమైన అమ్మాయి. అందమైన పేరు. డానా జొహేరి ఆలివెరోస్‌ క్రూయిజీ. అబ్బాయి అమ్మాయంత తెల్లగా లేకున్నా కళగా ఉన్నాడు. అమ్మాయి అన్ని విధాలుగా పైనున్నా.. అబ్బాయి భుజాల వరకు రావడమే తన గొప్ప అనుకుంది. నేర్చుకునే భాషలేవో యాప్‌లో నేర్చుకుంటూనే.. ఒకరినొకరు చెంతకు చేర్చుకున్నారు. 2017లో నిరంజన్‌ బర్త్‌డే కి మెక్సికో నుంచి ఇండియా వచ్చింది జొహేరి.

‘ఫ్రెండ్‌’ అని చెప్పాడు నిరంజన్‌ ఇంట్లో. ‘కోడలైతే బాగుండు’ అనుకున్నారు నిరంజన్‌ వాళ్ల అమ్మ. అన్నయ్యను డౌట్‌గా చూశాడు నిరంజన్‌ తమ్ముడు. నిరంజన్‌ తండ్రి పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ సంవత్సరం కూడా ఇండియా వచ్చింది జొహేరి. ఈసారి మాత్రం ‘నీ కోడలు’ అన్నాడు నిరంజన్‌.. తల్లితో. ఆమె ముఖం వెలిగిపోయింది. ఊరికే అన్నాడు అనుకుంది కానీ, ‘నాకు నువ్వు.. నీకు నేను’ అని వాళ్లకై వాళ్లు నిశ్చితార్థం చేసేసుకున్నారని ఆమె ఊహించలేదు. తర్వాత రెండేళ్ల వరకు జొహేరీకి ఇండియా రావడం కుదర్లేదు. మన లోకల్‌ ఒక్కసారీ మెక్సికో వెళ్లలేదు. వాళ్ల ప్రేమ మాత్రం ఆన్‌లైన్‌లో రానూపోనూ టిక్కెట్‌ లెస్‌ ట్రావెల్‌ చేస్తూనే ఉంది. 

నిరంజన్‌ తల్లి, నిరంజన్, జొహేరి, జొహేరి తల్లి  

కోడల్ని నిరంజన్‌ తల్లి చూసింది. అల్లుణ్ణి జొహేరీ తల్లి చూడొద్దా! ఈ ఏడాది ఫిబ్రవరిలో తల్లీకూతుళ్లు ఇండియా వచ్చారు. నిరంజన్‌ వాళ్లింట్లోనే ఉన్నారు. జొహేరీ తల్లి కూడా జొహేరీలా చలాకీగా, ఆమెకు సోదరిలా ఉండటం నిరంజన్‌ తల్లిని ఆశ్చర్యపరించింది. ఎంతైనా ఫారిన్‌ వాళ్లు! పెళ్లికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అవి చట్టం చేయవలసిన ఏర్పాట్లు. భారతీయులు విదేశీయులను పెళ్లి చేసుకోవాలంటే.. ‘స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ 1954’ కింద ముప్పై రోజుల ముందు నోటీస్‌ ఇవ్వాలి. పెళ్లికి దరఖాస్తు చేసుకోవడం అది. ఫిబ్రవరి 17న సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌కి విజ్ఞప్తిని పంపారు. మార్చి 18కి గడువు ముగిసింది. కానీ అప్పటికే రోహ్‌తక్‌లో లాక్‌డౌన్‌ ఛాయలు మొదలయ్యాయి.

పెళ్లయిపోయాక, ఒకసారి మెక్సికో వెళ్లి వచ్చేందుకు అంతకుముందే ఫ్లయిట్‌ టికెట్‌ బుక్‌ చేసుకుంది జొహేరీ. ఆ ప్రయాణమూ ఆగిపోయింది. ప్రయాణం మన చేతుల్లో లేదు. పెళ్లి మనదే కదా అనుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్‌ని కలిశారు. ఇండియాలోని మెక్సికన్‌ ఎంబసీ ఓకే చెప్పందే వీళ్లు ఒకటయేందుకు లేదు. అక్కడి నుంచి మేజిస్ట్రేట్‌ చేతుల్లోకి ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ రావడానికి రెండు వారాలకు పైగా టైమ్‌ పట్టింది. ఏప్రిల్‌ 13 కి అన్నీ క్లియర్‌ అయ్యాయి. ఆ రోజు రోహ్‌తక్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టు క్లర్కులు, ఇతర సిబ్బంది లాక్‌డౌన్‌లో కోర్టుకు చేరుకునేసరికి రాత్రి ఎనిమిది దాటింది. నిరంజన్, జొహేరీ దండలు మార్చుకున్నారు. మే 3 వరకు ఈ కొత్త జంటకు రోహ్‌తకే స్వర్గధామం. తర్వాత ఇద్దరూ కలిసి మెక్సికో వెళ్తారేమో తెలియదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

06-06-2020
Jun 06, 2020, 10:35 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కేవలం ఈ నాలుగు రోజుల్లోనే 367 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా......
06-06-2020
Jun 06, 2020, 10:11 IST
హిమాయత్‌నగర్‌: ‘కరోనా’ వైరస్‌ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారి కాంటాక్ట్స్‌ను సేకరించేందుకు ప్రతి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఓ...
06-06-2020
Jun 06, 2020, 09:46 IST
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది
06-06-2020
Jun 06, 2020, 09:35 IST
గువ‌హ‌టి : భార‌త్‌లో క‌రోనా తీవ్ర‌రూపం దాలుస్తోంది. ప్ర‌తిరోజూ రికార్డు స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నా కొంద‌రు మాత్రం నిబంధ‌న‌లు గాలికొదిలేస్తున్నారు....
06-06-2020
Jun 06, 2020, 09:33 IST
సాక్షి, ముంబై : బాలీవుడ్  పరిశ్రమలో వరుస కరోనా  కేసులు కలవరం రేపుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నిర్మాత అనిల్ సూరి (77)...
06-06-2020
Jun 06, 2020, 09:16 IST
కరోనా వైరస్‌ కబందహస్తాల్లో అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను అందించే నిమ్స్‌ ఆస్పత్రి విలవిలాడుతున్నది. సోమవారం నుంచి కరోనా తన...
06-06-2020
Jun 06, 2020, 08:58 IST
న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా క్రీడా లోకం పూర్తిగా స్తంభించిపోయింది. మార్చి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి...
06-06-2020
Jun 06, 2020, 08:33 IST
న్యూఢిల్లీ: కరోనా పేషంట్ల కొరకు దాదాపు 5000 మంచాలు సిద్ధంగా ఉన్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలిపింది. రాజధానిలో కరోనా...
06-06-2020
Jun 06, 2020, 07:42 IST
సాక్షి, సిటీబ్యూరో: ఆషాఢ బోనాలకు..ఈ యేడు కోవిడ్‌ రక్కసి అడ్డుపడుతోంది. గడిచిన వందేళ్లలో గతమెన్నడూ లేని రీతిలో సాధారణ భక్తులు...
06-06-2020
Jun 06, 2020, 05:21 IST
మహేశ్‌వారి పాటల సందడి మొదలైనట్లుంది. మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న...
06-06-2020
Jun 06, 2020, 04:37 IST
న్యూఢిల్లీ: అక్టోబర్‌ 4వ తేదీన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష జరగనుందని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) శుక్రవారం...
06-06-2020
Jun 06, 2020, 04:11 IST
కరాచీ: మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కరోనా వైరస్‌ బారిన పడ్డాడా? అవునని కొందరు కాదని కొందరు చెబుతున్నారు. పాకిస్తాన్‌...
06-06-2020
Jun 06, 2020, 04:05 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు 15 రోజుల గడువివ్వనున్నట్టు సుప్రీంకోర్టు...
06-06-2020
Jun 06, 2020, 03:03 IST
సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు ఆగస్టు, సెప్టెంబర్‌లో...
06-06-2020
Jun 06, 2020, 02:35 IST
పదో తరగతి విద్యార్థులు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే పరీక్షలు రాసేలా ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ...
06-06-2020
Jun 06, 2020, 02:22 IST
సాక్షి, హైదరాబాద్‌: వేకువజామునే సుప్రభాత సేవలు.. దైవ నామస్మరణలు, ఘంటానాదాలు, హారతులు, భక్తుల ప్రదక్షిణలు, మొక్కులు, తీర్థ ప్రసాదాల వితరణ....
06-06-2020
Jun 06, 2020, 00:35 IST
కరోనా పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిందని తెలిపారు ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌. ఇటీవల బోనీకపూర్‌ ఇంటి సిబ్బందిలో ముగ్గురికి కరోనా సోకిన...
06-06-2020
Jun 06, 2020, 00:19 IST
గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మే వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన ఉన్న ‘టాప్‌ 100’లో అక్షయ్‌...
05-06-2020
Jun 05, 2020, 21:42 IST
సాక్షి, అమరావతి : కరోనా వైరస్  సోకిన వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా మరణాల సంఖ్యను...
05-06-2020
Jun 05, 2020, 20:51 IST
జెరూసలెం : ఇజ్రాయెల్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ కేసులు గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పెరగడంతో ఆ దేశ ప్రభుత్వం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top