కణాలు చేసుకునే ఆత్మహత్య... ‘అపాప్టోసిస్’! | Committed to the cells 'apoptosis'! | Sakshi
Sakshi News home page

కణాలు చేసుకునే ఆత్మహత్య... ‘అపాప్టోసిస్’!

Published Sun, Aug 30 2015 11:45 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

కణాలు చేసుకునే ఆత్మహత్య... ‘అపాప్టోసిస్’! - Sakshi

మెడిక్షనరీ
 
కొన్ని కణాలు ఆత్మహత్య చేసుకుంటాయి. వినడానికి నివ్వెరపోయేలా అనిపించినా ఈ మాట వాస్తవం. ఉదాహరణకు గుడ్ల నుంచి పుట్టీపుట్టగానే... అది కప్పగా ఎదిగే క్రమంలో కొన్నాళ్ల పాటు దానికి తోక ఉంటుంది. తెలుగులో తోకకప్పగా పిలుచుకునే ఈ దశను ఇంగ్లిష్‌లో ‘టాడ్‌పోల్ లార్వా’ దశగా పేర్కొంటారు. మరి ఈ దశనుంచి కప్ప గా ఎదిగే క్రమంలో తోక ఏమవుతుంది. అది అక్కర్లేదు కాబట్టే కణాలు తమను తాము నిర్మూలించుకుంటాయి. దాంతో కప్ప రూపొందుతుంది. మరి ఇదే ప్రక్రియను అవసరం లేని కణాల విషయంలో జరిగేలా చూస్తే...? ఇలా వినూత్నంగా ఆలోచించడం వల్ల వచ్చిన ఒక వైద్యచికిత్స ప్రక్రియలో... జీవకణాల్లోని జీవపదార్థం (సైటోప్లాజమ్)లోకి కొన్ని రసాయనాలను పంపించి, కణం ఆత్మహత్య చేసుకునేలా  పురిగొల్పుతారు.

దాంతో సైటోప్లాజమ్ తనంతట తానుగా నాశనం అయ్యేలా తనను ‘ప్రోగ్రామ్’ చేసుకుంటుంది. ‘దీన్నే ప్రోగ్రామ్‌డ్ సెల్ డెత్’ అంటారు. గుట్టలుగుట్టలుగా పుట్టే క్యాన్సర్ కణాలు తమంతట తామే నాశనం అయ్యేలా కణాలను ప్రోగ్రామ్ చేసుకునేలా పురిగొల్పితే...? ఈ దిశగా ఆలోచిస్తూ క్యాన్సర్ కణాలు తమను తాము సంహరించుకునేలా శాస్త్రవేత్తలు ‘ప్రోగ్రామ్‌డ్ సెల్ డెత్’ ఆఫ్ క్యాన్సర్ జరిగేలా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement