కరోనా కామెడీ

China Demands Apology For Newspaper Corona Virus Cartoon - Sakshi

మూడ్‌ గమనించకుండా జోక్‌ చెయ్యకూడదు. ఆరోగ్యం మీద అసలే జోక్‌లు వెయ్యకూడదు. చైనా ఇప్పుడు కరోనా కష్టాల్లో ఉంది. కరోనా వైరస్‌ ప్రబలిపోతుంటే.. అంత పెద్ద ప్రభుత్వం కూడా కిందా మీదా అవుతోంది. ఈ సమయంలో చైనా మీద డెన్మార్క్‌ జోక్‌ చేసింది. అయితే జోక్‌ చేసింది డెన్మార్క్‌ ప్రభుత్వం కాదు. డెన్మార్క్‌లోని ‘జిలాండ్స్‌ పోస్టెన్‌’ అనే న్యూస్‌ పేపర్‌. చైనా.. కరోనా కోరల్లో చిక్కుకుందని చెప్పడానికి ఆ పేపర్‌ వేసిన కార్టూన్‌ చైనాను తీవ్రంగా నొప్పించింది. చైనా జాతీయ జెండా ఎర్రగా ఉంటుంది.

జెండాకు ఎడమ వైపున పైభాగంలో ఓ పెద్ద నక్షత్రం, దానికి కింద నాలుగు చిన్న నక్షత్రాలు  ఉంటాయి. ఆ ఐదు నక్షత్రాల స్థానంలో ఐదు కరోనా క్రిములను గీశాడు కార్టూనిస్టు. అది కోపం తెప్పించింది డెన్మార్క్‌లోని చైనా  కార్యాలయానికి. వెంటనే క్షమాపణ చెప్పాలని ఆ పేపర్‌ని డిమాండ్‌ చేసింది. కనీస సానుభూతి కూడా లేకుండా పత్రికా స్వేచ్ఛను ఉపయోగించుకోవడం ఏంటని మండిపడింది. ఆ పత్రిక ఎడిటర్‌ మాత్రం.. ‘‘మేము ఈ కార్టూన్‌ని సదుద్దేశంతోనే వేయించాం’’ అంటున్నారు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top