
కారే డ్రైవర్!
కారులో రయ్యి రయ్యిమని దూసుకెళుతున్నప్పుడు స్టీరింగ్‌మీది చేతులు వదిలేస్తే ఏమవుతుంది? కాసేపటివరకూ ఏం కాదుగానీ...
కారులో రయ్యి రయ్యిమని దూసుకెళుతున్నప్పుడు స్టీరింగ్‌మీది చేతులు వదిలేస్తే ఏమవుతుంది? కాసేపటివరకూ ఏం కాదుగానీ... ఆ తరువాత ఏమైనా కావచ్చు. కానీ మీరు ఎలన్ మస్క్ రూపొందించిన టెస్లా కారును నడుపుతున్నారనుకోండి. ఎంతసేపైనా ఏమీ కాదు. ఎందుకంటే అందులో ఆటోపైలట్ టెక్నాలజీ ఉంది కాబట్టి. డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు తనంతట తానే ముందుకెళ్లడం గురించి మనం ఇటీవలి కాలంలో తరచూ వింటునే ఉన్నాం.
తాజాగా టెస్లా కూడా తన ఆటోపైలట్ సిస్టమ్‌తో ఇలాంటి టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకూ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీని ఇతరదేశాల్లోనూ ప్రవేశపెట్టేందుకు అవసరమైన అనుమతులన్నీ వచ్చేశాయని ఇటీవలే ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.
ఆటోపైలట్ సిస్టమ్ అటు స్టీరింగ్‌తోపాటు ఆటోమెటిక్‌గా లేన్లు మారడం, అడ్డంకులను గుర్తించి తదనుగుణంగా బ్రేకులు వేయడం కూడా చేస్తుంది. మూడేళ్లలో అసలు డ్రైవర్ల అవసరం లేని పూర్తిస్థాయి అటానమస్ కారును అభివృద్ధి చేస్తామని అంటున్నారు మస్క్. చూద్దాం మరి!