బ్రకోలీతో లివర్ క్షేమం | Sakshi
Sakshi News home page

బ్రకోలీతో లివర్ క్షేమం

Published Thu, Mar 10 2016 10:50 PM

బ్రకోలీతో లివర్ క్షేమం

పరిపరి  శోధన
తరచుగా బ్రకోలీ తీసుకుంటే లివర్ పదికాలాల పాటు క్షేమంగా ఉంటుందని అమెరికాలోని ఇల్లినాయీ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వారానికి మూడు నుంచి ఐదుసార్లు బ్రకోలీ తీసుకునేట్లయితే లివర్ కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని వారు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి జబ్బులను నివారించడంలోనూ బ్రకోలీ బాగా ఉపయోగపడుతుందని ఇల్లినాయీ వర్సిటీ పరిశోధకురాలు ప్రొఫెసర్ ఎలిజబెత్ జెఫరీ చెబుతున్నారు. బ్రకోలీకి దగ్గరగా ఉండే కాలిఫ్లవర్ వల్ల కూడా దాదాపు ఇలాంటి ఉపయోగాలే ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Advertisement
Advertisement