
మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే లివర్‌ను డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కాలేయ శుభ్రతకు ఉపయోగపడే యోగాసనాలు...
ధనురాసనం.. ఎలా చేయాలి..?
బోర్లా పడుకుని తలను కొంచె పైకి ఎత్తాలి. వెనుక నుంచి పాదాలను పట్టుకొని, విల్లు లాంటి ఆకారాన్ని ఏర్పాటు చేయాలి. 5 దీర్ఘ శ్వాసల వరకు ఈ పొజిషన్‌లోనే ఉండాలి. మెల్లగా యధాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.
అర్థ మత్సే్యంద్రాసనం..
ఈ ఆసనం లివర్‌ను క్లీన్ చేయడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి శక్తిమంతంగా పనిచేస్తుంది. పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత ఒక పాదాన్ని హిప్ కిందకు తేవాలి. కుడి తొడను అలాగే ఉంచి, ఎడమ కాలిని నేలమీద ఆనించాలి. కుడి మోకాలును వంచి, ఎడమ మోకాలును కుడి మోకాలుకు దగ్గరగా ఉంచాలి. కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలుతో ఎడమ కాలివేలును పట్టి ఉంచాలి. శరీరాన్ని ఎడమవైపుకు మెల్లగా తి΄్పాలి. అంటే ఒకే సమయంలో భుజాలు, మెడ, తలను ఎడమవైపుకు తి΄్పాలి. గడ్డాన్ని ఎడమ భుజం వద్దకు తి΄్పాలి. ఈ ఆసనంలో మీ తలను, వెన్నెముకను స్థిరంగా ఉంచాలి. మెల్లగా ప్రారంభ స్థితికి తిరిగి రావాలి. ఈ ఆసనాన్ని కుడివైపున కూడా చేయాలి.
భుజంగాసనం..
భుజంగాసనం సాధన చేయడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది. దీనిని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. రోజూ 5 నిమిషాల పాటు భుజంగాసనం వేస్తే లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గుతుంది.
ఎలా వేయాలంటే...
బోర్లా పడుకొని శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీ పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి. ఆ తర్వాత శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీని పైకి లేపాలి. మోచేతులు నేలకు ఆనించి, ఉంచాలి. కొంచెం సేపు తర్వాత శ్వాసను వదులుతూ.. తిరిగి సాధారణ స్థితికి రావాలి.