కూల్‌ ప్యాక్స్‌

beauty tips:cool face pack - Sakshi

 సమ్మర్‌ కేర్‌

వేడిమి, దుమ్ము ఈ కాలం చర్మపు రంగును, తాజాదనాన్ని తగ్గిస్తాయి. వేసవి కాలంలో చర్మనిగారింపు కోల్పోకుండా, వేడి నుంచి  ఉపశమనం పొందాలంటే ఇంట్లోనే వేసుకోదగిన కూల్‌ ప్యాక్స్‌ ఉన్నాయి. 

50 గ్రాముల ఎర్రకందిపప్పులో తగినన్ని నీళ్లు పోసి రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బాలి. దీంట్లో పచ్చిపాలు, బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మేనికంతా పట్టించి, మృదువగా మసాజ్‌ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. తర్వాత టీ స్పూన్‌ పుదీనా ఆకుల పేస్ట్‌లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాíసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. 

బాదం నూనెలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, కళ్లకింద, మెడ, గొంతు, చేతులపై మృదువుగా రాయండి. అరగంట తర్వాత  గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.దోసకాయ గుజ్జులో టేబుల్‌ స్పూన్‌ పంచదార కలిపి, ఫ్రిజ్‌లో చల్లబడేవరకు ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి.  శనగపిండిలో తేనె కలిపి ముఖానికి, చే తులకు రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top