బ్యూటిప్స్‌ | Beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్‌

Sep 17 2017 12:18 AM | Updated on Sep 19 2017 4:39 PM

బ్యూటిప్స్‌

బ్యూటిప్స్‌

గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉండాలన్నా, గోళ్ళపై పసుపుదనం పోవాలన్నా నిమ్మచెక్కతో రుద్దాలి.

గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉండాలన్నా, గోళ్ళపై çపసుపుదనం పోవాలన్నా నిమ్మచెక్కతో రుద్దాలి.
బలమైన గోళ్ళు మీ సొంతం కావాలంటే ఒక వెల్లుల్లి రేకను తీసుకొని గోళ్ళపై రుద్దాలి. ఇలా తరచూ చేస్తుంటే గోళ్ళు తెల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి.
పుచ్చకాయ గుజ్జును శరీరానికి రాసుకుంటే రక్షణ, పోషణ లేక కమిలిన చర్మం మామూలుగా తయారవుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. చర్మం కొత్తకాంతిని సంతరించుకుంటుంది.
రుబ్బిన మినపపిండిలో చిటికెడు గంధపుపొడి కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకుని, తెల్లవారి కడగాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజులపాటు చేస్తే మచ్చలు, గీతలు పోతాయి.
ఒక స్పూన్‌ తేనెలో అర టేబుల్‌ స్పూన్‌ బాదం పొడి, ఒక కోడిగుడ్డు, నిమ్మరసం బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మర్దన చేసిన తర్వాత పదిహేను నిమిషాల సేపు అలాగే వదిలేయాలి. ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే మృతకణాలు, యాక్నె పోయి ముఖం తాజాగా మారుతుంది. యాక్నె లేకపోయినప్పటికీ జిడ్డు చర్మానికి ఈ ప్యాక్‌ బాగా పని చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement