సహజ సౌందర్యం | beauty tips | Sakshi
Sakshi News home page

సహజ సౌందర్యం

Dec 29 2016 11:29 PM | Updated on Sep 4 2017 11:54 PM

సహజ సౌందర్యం

సహజ సౌందర్యం

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె కాని ఆలివ్‌ ఆయిల్‌ కాని ముఖానికి, చర్మం పొడిబారిన ప్రదేశాల్లోనూ రాయాలి.

బ్యూటిప్స్‌

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె కాని ఆలివ్‌ ఆయిల్‌ కాని ముఖానికి, చర్మం పొడిబారిన ప్రదేశాల్లోనూ రాయాలి. ఆయిల్‌ అప్లయ్‌ చేసే ముందు మురికి, దుమ్ము లేకుండా చర్మం శుభ్రంగా ఉండాలి.  పొడిచర్మాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. దోసిట్లో నీళ్లు తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇలా రోజూ పది నిమిషాల సేపు
ముఖానికి హాట్‌వాటర్‌ థెరపీ చేయాలి.

ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్‌ కమలారసం, ఒక టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. పొడిచర్మానికి ఈ ప్యాక్‌ మంచి ఫలితాన్నిస్తుంది.

పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను ఒంటికి రాసి మర్దన చేస్తే సరి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడ నల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపును వదిలిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement