సహజమైన రంగు... | beauty tips | Sakshi
Sakshi News home page

సహజమైన రంగు...

Jun 22 2016 10:53 PM | Updated on Sep 4 2017 3:08 AM

సహజమైన రంగు...

సహజమైన రంగు...

హెయిర్ కలర్స్ వాడకం వల్ల వాటిలోని రసాయనాలు కొందరి చర్మతత్త్వానికి సరిపడకపోవడం,

బ్యూటిప్స్


హెయిర్ కలర్స్ వాడకం వల్ల వాటిలోని రసాయనాలు కొందరి చర్మతత్త్వానికి సరిపడకపోవడం, జుట్టు సహజమైన కాంతి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటికి విరుగుడుగా కురులకు మంచి అందాన్ని, రంగును ఇచ్చేవి ప్రకృతిలోనే సహజసిద్ధమైనవి ఉన్నాయి. వాటిలో...

 
ఎర్రని బంతిపూలను వేసి, బాగా మరిగించిన కప్పుడు నీటిని మాడునుంచి శిరోజాలకు పూర్తిగా పట్టించాలి. గంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. తలలో అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకలు ఎర్రగా అవుతాయి. జట్టుకు రంగు వేసుకోవాలనుకునేవారికి ఇది ఆర్గానిక్ హెయిర్ డైలా ఉపయోగపడుతుంది.

 
బీట్‌రూట్‌ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. కురులకు కొద్దిగా పర్పుల్ కలర్ వస్తుంది. హెయిర్ కలర్స్ వాడే యువతరపు జుట్టుకు ఇది మంచి ఆప్షన్.

 
హెయిర్ కలర్స్ వాడేవారు జుట్టు పొడిబారి వెంట్రుకుల బిరుసుగా అవుతాయనుకుంటే... టేబుల్ స్పూన్ పెరుగులో పెసరపిండి కలిపి, రెండు రోజులు బయటే ఉంచాలి. తర్వాత రోజు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే కలర్‌లో ఉండే రసాయనాల ప్రభావం తగ్గడమే కాకుండా వెంట్రుకలు మృదువుగా అవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement