అందమె ఆనందం | Beauty and happiness | Sakshi
Sakshi News home page

అందమె ఆనందం

Dec 4 2014 10:48 PM | Updated on Sep 2 2017 5:37 PM

అందమె ఆనందం

అందమె ఆనందం

ముఖమ్మీది చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంటే... అరకప్పు ఓట్స్ పొడిలో కాసింత పెరుగు, టొమాటో గుజ్జు కలిపి ముఖానికి ....

ముఖమ్మీది చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంటే... అరకప్పు ఓట్స్ పొడిలో కాసింత పెరుగు, టొమాటో గుజ్జు కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మం కాంతులీనుతుంది.
 
బాదంపప్పు పేస్టులో కాసిన్ని పాలు, నిమ్మరసం, కొద్దిగా మినప్పప్పు కలిపి ముఖానికి ప్యాక్ వేసు కోవాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖమ్మీది మృతకణాలు తొలగి పోతాయి.
 
చలికాలం వచ్చేసింది కాబట్టి ఒక్కోసారి చర్మం బిరుసుగా తయారై ముఖం కళను కోల్పోతుంది. అలాంటప్పుడు అరకప్పు పాల పొడిలో నాలుగు చెంచాల తేనె, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దీనితో ముఖానికి ప్యాక్ వేసుకుని, పూర్తిగా ఆరిన తరువాత కడిగేసుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తుంటే చర్మం బిరుసుగా అవకుండా ఉంటుంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement