బ్యూటిప్స్ | beaty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్

Oct 4 2015 12:08 AM | Updated on Sep 3 2017 10:23 AM

బ్యూటిప్స్

బ్యూటిప్స్

ముఖం తరచు జిడ్డుగా మారుతోందా? అయితే, చెంచాడు ముల్తానీ మట్టిలో కాస్తంత రోజ్‌వాటర్, తాజా నిమ్మరసం కలిపి పేస్టులా తయారు

ముఖం తరచు జిడ్డుగా మారుతోందా? అయితే, చెంచాడు ముల్తానీ మట్టిలో కాస్తంత రోజ్‌వాటర్, తాజా నిమ్మరసం కలిపి పేస్టులా తయారు చేయండి. ఆ పేస్టును ముఖానికి ప్యాక్‌లా పట్టించి, అరగంటసేపు గాలికి ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లయినా ఈ ప్యాక్ అప్లై చేస్తే, ముఖం నుంచి జిడ్డు మటుమాయం అవుతుంది.

మోచేతుల దిగువ నల్లగా మారి చూడటానికి ఇబ్బందిగా ఉంటోందా? రసం తీసేసిన నిమ్మచెక్కలతో రుద్ది, పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. నలుపు తగ్గి, మోచేతులు కూడా నిగనిగలాడతాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement