బ్రాండ్‌ అంబాసిడర్‌

Auto Driver Awareness on COVID 19 Virus - Sakshi

కరోనా నివారణలో ప్రథమాస్త్రం శానిటైజర్‌. వీలైనన్ని సార్లు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోండనే ప్రచారం చెవిన ఇల్లుకడుతోంది. ఈ నియమాన్ని తు.చ తప్పక పాటిస్తూ శుభ్రతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు ఊబర్‌లో ఆటో నడిపిస్తున్న గుగులోత్‌ భాను. తను మాస్క్‌ కట్టుకోవడమే కాదు.. తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులూ కట్టుకునేలా చేస్తున్నాడు.. ‘మీరు మాస్క్‌ వేసుకోకపోతే నా ఆటోలో రావద్దు’ అని హెచ్చరిస్తూ.

ప్రయాణికులను వాళ్ల వాళ్ల గమ్యస్థానాల్లో చేర్చాక .. ఆటోలో ఉన్న తన బ్యాగ్‌లోంచి శానిటైజర్‌ తీసి.. ఆటో సీటు, హ్యాండిల్స్‌ అన్నీ శుభ్రపరిచి.. ఆ టిష్యూలను బయట పారేయకుండా మరో బ్యాగ్‌లో పెడ్తున్నాడు. ‘వాటినెక్కడ పారేస్తావ్‌?’ అని అడిగితే.. ‘పారేయను మేడం.. సాయంత్రం మా ఇంటికి వెళ్లాక.. అక్కడే ఇంటిదగ్గర పూడ్చేస్తా.. లేకపోతే కాల్చేస్తా’ అని సమాధాన మిచ్చాడు.‘ఈ జాగ్రత్త తన కోసమే కాదు.. తోటి ప్రయాణికుల కోసం కూడా. చదువుకున్న వాళ్లం ఈ మాత్రం పాటించకపోతే చదువుకోని వాళ్లెలా తెలుసుకుంటారు?’ అని తన సివిక్‌ సె¯Œ ్సను ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాడు భాను. కరోనా నివారణ చర్యల గురించి చెప్పడానికి ఇంతకన్నా గొప్ప బ్రాండ్‌ అంబాసిడర్‌ దొరుకుతాడా? 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top