ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం

Nature is a compound of farmers - Sakshi

14న విజయవాడలో

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి రెండో సమ్మేళనం అక్టోబర్‌ 14వ తేదీ(శనివారం)న విజయవాడలో జరగనుంది. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయదారులు తరలిరావాలని ఏపీ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అగ్ర నేత కుమారస్వామి(94401 27151) పిలుపునిచ్చారు.

సిరిధాన్యాల ‘అటవీ కృషి’పై డా. ఖాదర్‌ శిక్షణ
అరిక, సామ, కొర్ర తదితర సిరిధాన్యాలను ‘అటవీ కృషి’ పద్ధతుల్లో సాగు చేయడం, శుద్ధి చేయడం, సిరిధాన్యాలను ప్రధాన ఆహారంగా తినడం ద్వారా జబ్బులను పారదోలడంపై కర్ణాటకకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ మైసూర్‌ సమీపంలోని తన సిరిధాన్య క్షేత్రంలో రైతులకు, ఔత్సాహికులకు సెప్టెంబర్‌ 30 – అక్టోబర్‌ 1 తేదీల్లో శిక్షణ ఇస్తారు.

‘అటవీ చైతన్యం’ అనే ప్రకృతి సేద్య ద్రావణాన్ని తయారు చేసుకోవడం, వాడటం ఎలాగో నేర్పిస్తారు. ఈ పద్ధతిలో సాగయ్యే మిశ్రమ పంటల క్షేత్రాన్ని చూపిస్తారు. 28వ తేదీలోగా పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలి. ప్రవేశ రుసుము: రూ. 2 వేలు. వివరాలకు 097422 58739 నంబరులో వాట్సప్‌/మెసేజ్‌ ద్వారా సంప్రదించవచ్చు.

గో ఆధారిత ప్రకృతిసేద్యంపై అక్టోబర్‌ 10న బసంపల్లిలో శిక్షణ
అనంతపురం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు దేశీ గో ఆధారిత ప్రకృతిసేద్యంపై రైతులకు ప్రతి నెలా మొదటి సోమవారం శిక్షణ ఇస్తున్నారు. అక్టోబర్‌ 10న సీకే పల్లి మండలం బసంపల్లి గ్రామంలో ఉదయం 9 గం. నుంచి సా. 4.30 వరకు శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు ముందుగా ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేయించుకోవాలి. ప్రవేశ రుసుము రూ. 100. ఇతర వివరాలకు నాగరాజు (94407 46074) పార్థసారధి (96633 67934)లను సంప్రదించవచ్చు.

1న వరి, కూరగాయల సాగుపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో అక్టోబర్‌ 1న వరి, కూరగాయల ప్రకృతి సేద్యంపై ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి, రైతు ధర్మారం బాజీ శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863 2286255 నంబర్లలో సంప్రదించవచ్చు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top