మగాడివైతే విచారణ జరిపించాలి | you have a gentlt man investigation is required | Sakshi
Sakshi News home page

మగాడివైతే విచారణ జరిపించాలి

Apr 22 2014 3:12 AM | Updated on Aug 15 2018 8:23 PM

మగాడివైతే విచారణ జరిపించాలి - Sakshi

మగాడివైతే విచారణ జరిపించాలి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మగాడైతే తమ పార్టీ అధినేత కె చంద్రశేఖర్‌రావు ఆస్తులపై విచారణ జరిపించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు సవాల్ చేశారు

టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు కేటీఆర్ సవాల్

 సిరిసిల్ల  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మగాడైతే తమ పార్టీ అధినేత కె చంద్రశేఖర్‌రావు ఆస్తులపై విచారణ జరిపించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు సవాల్ చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆస్తులపై విచారణ జరుపుతామని పొన్నాల పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. తమపై సీబీఐ కేసుల్లేవని, అవినీతి ఆరోపణలు అంతకంటే లేవన్నారు. విచారణ చేసినా చేసేదేమీలేదన్నారు. కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement