తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీమాంధ్రలో ఎందుకు బీసీ అభ్యర్థిని సీఎంను చేస్తానని చెప్పడం లేదని టీఆర్‌ఎస్ నేత, ఎంపీ మందా జగన్నాథం సూటిగా ప్రశ్నించారు.
బాబుకు మందా జగన్నాథం సూటిప్రశ్న
న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీమాంధ్రలో ఎందుకు బీసీ అభ్యర్థిని సీఎంను చేస్తానని చెప్పడం లేదని టీఆర్‌ఎస్ నేత, ఎంపీ మందా జగన్నాథం సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి ఎలాగూ రాలేమని తెలిసే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కట్టుకథలు చెబుతూ చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. జగన్నాథం బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
బీసీలకు తగిన ప్రాధాన్యమిచ్చిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఈటెల రాజేందర్‌ను నియమించారని తెలిపారు. తెలంగాణకు దళితుడిని సీఎంని చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆమాటను వెనక్కి తీసుకోలేదన్నారు. వివేక్, కె.కేశవరావు టీఆర్‌ఎస్‌ను వీడతారన్న ప్రచారంలో నిజం లేదన్నారు.