‘బోటు’ మీదొట్టు..ఓటు బ్రహ్మాస్త్రం పెట్టు | Understanding of the fishermen on the right to vote | Sakshi
Sakshi News home page

‘బోటు’ మీదొట్టు..ఓటు బ్రహ్మాస్త్రం పెట్టు

Apr 6 2014 12:03 AM | Updated on Aug 29 2018 8:54 PM

‘బోటు’ మీదొట్టు..ఓటు బ్రహ్మాస్త్రం పెట్టు - Sakshi

‘బోటు’ మీదొట్టు..ఓటు బ్రహ్మాస్త్రం పెట్టు

వలను పువ్వులా విచ్చుకునేలా విసిరినప్పుడే జాలరి కష్టం ఫలిస్తుంది. ఓటు అనే ఆయుధాన్ని గురి చూసి ప్రయోగించినప్పుడే.. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.

 వలను పువ్వులా విచ్చుకునేలా విసిరినప్పుడే జాలరి కష్టం ఫలిస్తుంది. ఓటు అనే ఆయుధాన్ని గురి చూసి ప్రయోగించినప్పుడే.. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. వల విసరడంలోనే కాదు- ఓటు వేయడంలోనూ ఒడుపు అవసరం. ఓటు హక్కు విలువపై అవగాహన, దాని వినియోగంలో చైతన్యం ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదాలు. కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచి వాకలపూడి వరకూ కడలిపై వేటాడే మత్స్యకారులకు ఓటు హక్కుపై అవగాహన, చైతన్యం కల్పించేందుకు శనివారం విలక్షణ రీతిలో బోటు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ నీతూప్రసాద్, కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్, పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు.                - న్యూస్‌లైన్, కాకినాడ రూరల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement