రానున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే: వినోద్ | TRS Government coming soon in telangana, says boinapally vinod kumar | Sakshi
Sakshi News home page

రానున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే: వినోద్

May 2 2014 11:51 PM | Updated on Aug 14 2018 4:24 PM

రానున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే: వినోద్ - Sakshi

రానున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే: వినోద్

తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదట ఏర్పడబోయేది టీఆర్‌ఎస్ సర్కారేనని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ అన్నారు.

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదట ఏర్పడబోయేది టీఆర్‌ఎస్ సర్కారేనని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ అన్నారు. కరీంనగర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పద్నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సాగిన ప్రజలు వెన్నంటి ఉన్నారన్నారు.

అదే స్ఫూర్తితో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఏకపక్షంగా ఓట్లు వేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించనున్నారని చెప్పా రు. తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించి ఎవరి పొత్తు అవసరం లేకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని వివరించారు. అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో  ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నూరు శాతం నెరవేరుస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement