విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేతలు దాదాగిరికి దిగారు.
విజయవాడ : విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేతలు దాదాగిరికి దిగారు. పార్టీ ఫండ్ పేరిట వ్యాపారులకు ఫోన్ చేసి టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచటానికి అక్రమ మార్గం పట్టారు. దీంతో వ్యాపారులు 'సాక్షి'కి సమాచారం ఇచ్చి ఫోన్ రికార్డులను బయట పెట్టారు.
మరోవైపు టీడీపీ నేతలు బోండా ఉమ వర్గీయులు ఆస్పత్రులను టార్గెట్ చేసుకొని భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బు ఇవ్వకుంటే ఎమ్మెల్యే అయ్యాక అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అయితే బెదిరింపులపై ఫిర్యాదు చేసేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు జంకుతున్నాయి.