టీడీపీ మద్యం తాగి.. కార్యకర్త మృతి | tdp activist dies after consuming liquor | Sakshi
Sakshi News home page

టీడీపీ మద్యం తాగి.. కార్యకర్త మృతి

May 6 2014 1:43 PM | Updated on Aug 14 2018 4:24 PM

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి తెచ్చిన మద్యం వాళ్ల సొంత పార్టీ కార్యకర్త ప్రాణాలు తీసింది.

తెలుగుదేశం పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి తెచ్చిన మద్యం వాళ్ల సొంత పార్టీ కార్యకర్త ప్రాణాలు తీసింది. టీడీపీ వర్గాలు పంచిపెట్టిన నకిలీ మద్యాన్ని తాగి ఓ కార్యకర్త మరణించాడు. ఆ జిల్లాలోని నాదెండ్ల మండలం గొరిజవోలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంపిణీ చేసిన మద్యం తాగి షేక్ సుబానీ అనే కార్యకర్త మరణించాడు.

దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పార్టీ కోసం జెండా మోసిన సుబానీ.. ఇప్పుడు వాళ్లిచ్చిన మద్యం వల్లే మరణించాడంటూ అతడి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement