రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు.
పుల్లలచెరువు, న్యూస్‌లైన్ : రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. మండలంలోని ఐటీవరం, చౌటపాచర్ల, కొండారెడ్డి కొష్టాలు, ముటుకుల గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజుతో కలిసి బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. ఆయన పాలనలో ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందిందన్నారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి మహోన్నత పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చెరగని ముద్రవేసుకున్నారని కొనియాడారు.
మహానేత సంక్షేమ పథకాలకు ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తూట్లు పొడిచారని విమర్శించారు. వైఎస్సార్ పథకాలు తిరిగి అమలు చేయాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి అవసరమన్నారు. ప్రజా సంక్షేమం కోరే నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లకు బాలాజీ పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలన్నింటినీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తారని చెప్పారు. వైఎస్సార్ సీపీతోనే సీమాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు.
యువకులు వైఎస్సార్ సీపీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. బాలాజీ, డేవిడ్‌రాజులు వీరికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు కోటిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సెంట్రల్ బ్యాంక్ మాజీ డెరైక్టర్ బి.సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డు డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సుందరరావు, సర్పంచ్‌లు సీతారామిరెడ్డి, అబ్రహం, జి.శ్రీనివాసరావు, పాపయ్య, ఎండ్రపల్లి స్వామి, బీవీ సుబ్బారెడ్డి, కె.బచ్చయ్య, కె.వెంకటేశ్వర్లు, ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, బుల్లెబ్బాయి, బడే సాహెబ్, లక్ష్మీబాయి, శంకరరెడ్డి, గాలిరెడ్డి పాల్గొన్నారు.