పెనుకొండ ఎమ్మెల్యేగా శంకర నారాయణను గెలిపిస్తే క్యాబినెట్‌లో మంత్రిగా తీసుకుంటానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.
పెనుకొండ, న్యూస్‌లైన్ : పెనుకొండ ఎమ్మెల్యేగా శంకర నారాయణను గెలిపిస్తే క్యాబినెట్‌లో మంత్రిగా తీసుకుంటానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. బుధవారం పెనుకొండలోని అంబేద్కర్ సర్కిల్‌లో జరిగిన ‘వైఎస్‌ఆర్ జనభేరి’ సభలో ఆయన ప్రసంగిస్తూ.. శంకర నారాయణ ఉన్నత విద్యావంతుడని, మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడని ప్రశంసించారు. పార్టీ కోసం శ్రమించిన ఆయనను పెనుకొండ నియోజకవర్గ ప్రజలు ఆదరించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
హిందూపురం ఎంపీ అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డిని గెలిపించాలని, ఆయనను గెలిపిస్తే భవిష్యత్‌లో యువతకు ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన బాబురెడ్డికి భవిష్యత్‌లో తగిన స్థానం కల్పిస్తామని, ఎప్పటికీ తన గుండెల్లో బాబురెడ్డి ఉంటారన్నారు. ఎన్నికలయ్యాక కూడా బాబురెడ్డి తనతో ఉంటారన్నారు. అనంతరరం పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు నూర్‌బాషా, జాహెదుల్లాఖాన్, ఫరీద్ తదితరులు జగన్‌ను శాలువతో సత్కరించారు.