
వారి పనిపడతా: రాయపాటి
నరసరావుపేట కేంద్రంగా పలనాడు ప్రాంతాన్ని కలుపుకుని ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీగా ఎన్నికైన రాయపాటి సాంబశివరావు తెలిపారు.
నరసరావుపేట: నరసరావుపేట కేంద్రంగా పలనాడు ప్రాంతాన్ని కలుపుకుని ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీగా ఎన్నికైన రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఎంపీగా ఎన్నికైన ఆయన శనివారం నరసరావుపేట వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన విజయానికి చంద్రబాబు నాయకత్వం, పవన్ కల్యాణ్ ప్రచారం దోహదపడ్డాయని చెప్పారు.
వాస్తవానికి ఇంకా ఎక్కువ మెజార్టీ రావలసి ఉందని అంటూ, నియోజకవర్గంలో తనకు వచ్చిన మెజార్టీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇటీవల జరిగిన జమిలి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు, ఇతర అధికారులను గుర్తించామని, తగిన సమయంలో వారి పనిపడతామన్నారు.