పోటాపోటీగా బహిరంగ సభలు | Open sermons general elections campaign | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా బహిరంగ సభలు

Apr 24 2014 1:47 AM | Updated on Mar 29 2019 9:24 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బహిరంగ సభలకు దీటుగా బీజేపీ ఆదిలాబాద్‌లో కూడా బుధవారం బహిరంగ సభ నిర్వహించింది.

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బహిరంగ సభలకు దీటుగా బీజేపీ ఆదిలాబాద్‌లో కూడా బుధవారం బహిరంగ సభ నిర్వహించింది. డైట్ మైదానంలో జరిగిన ఈ సభలో ప్రసంగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్‌కు ఓటేయాలని సభకు హాజరైన వారిని విజ్ఞప్తి చేశారు. కా నీ ఎంపీగా పోటీచేస్తున్న టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రాథోడ్ రమేష్ ప్రస్తావన మాత్రం ఎక్కడా తీసుకురాలేదు. ఆయనకు కనీసం ఓటేయాలని కూడా చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ బహిరంగ సభలో ఏ ఒక్క టీడీపీ నాయకుడు కనిపించలేదు.

 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ, జిల్లా లో ఆ పార్టీల శ్రేణులు ఎవరికి వారే అన్న చందంగా వ్య వహరిస్తున్నాయి. మొదటి నుంచి ఈ రెండు పార్టీల నా యకులు అంటిముట్టనట్లే ఉంటున్నారు. ఒక్కోసారి ప్ర త్యర్థి పార్టీల మాదిరిగా వ్యవహరిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈరోజు రెండు పార్టీల అధ్యక్షులు ఎవరికి వారే జిల్లాలో పర్యటనలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటాం..
 ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో బీడు భూములను సాగునీరు అందేలా ప్రాజెక్టు నిర్మాణం చేపడతామన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువత గల్ఫ్ వంటి దేశాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ వస్తోందని విమర్శించారు.

ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు వైద్యం అందక పదుల సంఖ్యలో మరణిస్తుంటే కాంగ్రెస్ పాలకులకు కనీసం చీమ కుట్టినట్లయిన అనిపించలేదని నిప్పులు చెరిగారు. పత్తి అధికంగా పండిస్తున్న జిల్లాలో టెక్స్‌ైటె ల్స్ పార్కును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. సీసీఐని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్‌లో గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్‌ను, ఆదిలాబాద్ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులను చేపడతామన్నారు. హైదరాబాద్‌కు దూరంగా ఉన్న ఆదిలాబాద్‌లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

సింరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించి కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు. పెన్‌గంగా ప్రాజెక్టును నిర్మించి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాస్, శ్రీరాంనాయక్, మురళీధర్‌గౌడ్, జిల్లా నాయకులు గందే విజయ్‌కుమార్, విష్ణుప్రకాశ్ బజాజ్, మడావి రాజు, అమర్‌సింగ్ తిలావత్, జనగం సంతోష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement