టీఆర్ఎస్ వీడేది లేదు: వివేక్ | MP Vivek says will not leave TRS | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ వీడేది లేదు: వివేక్

Mar 26 2014 2:55 PM | Updated on Aug 15 2018 9:17 PM

టీఆర్ఎస్ వీడేది లేదు: వివేక్ - Sakshi

టీఆర్ఎస్ వీడేది లేదు: వివేక్

తాను టీఆర్ ఎస్ ను వీడేది లేదని, తన విషయంలో వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని వివేక్ కెసిఆర్ కి చెప్పారు

గత కొద్ది కాలంగా టీఆర్ ఎస్ అధినేత వ్యవహార శైలి విషయంలో అసంతృప్తిగా ఉన్న పెద్దపల్లి ఎంపీ వివేక్ బుధవారం ఆయన్ను కలుసుకున్నారు. తాను టీఆర్ ఎస్ ను వీడేది లేదని, తన విషయంలో వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని ఆయన కెసిఆర్ కి చెప్పారు. తాను టీఆర్ ఎస్ నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్పారు.


ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి  గతేడాది జూన్ 2 న టీఆర్ ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. ఈ మధ్య ఆయన పార్టీ వీడి టీఆర్ఎస్ లో చేరతారని ఊహాగానాలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్ తనంతట తానుగా వెళ్లి కెసిఆర్ ను కలిసి తన వాదన వినిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement