టికెట్ ఇవ్వకపోవడం బాధాకరం: బిక్షపతి | Moluguri Bikshapathi disappointed not to give Party ticket | Sakshi
Sakshi News home page

టికెట్ ఇవ్వకపోవడం బాధాకరం: బిక్షపతి

Apr 9 2014 2:48 AM | Updated on Mar 22 2019 6:25 PM

ఉద్యమంలో కేసులు, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న త మకు తెలంగాణలో న్యాయం జరగుతుందని భావిస్తే టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు.

పరకాల, న్యూస్‌లైన్: ఉద్యమంలో కేసులు, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న త మకు తెలంగాణలో న్యాయం జరగుతుందని భావిస్తే టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. మంగళవారం పరకాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మరోసారి ఆలోచించి న్యాయం చేయాలని కోరారు. పలువురు నాయకులు మాట్లాడుతూ పరకాలలో ఉద్యమ పార్టీ బలోపేతానికి కృషి చేసిన బిక్షపతికి తీరని అన్యాయం చేశారన్నారు. సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు చెబుతుండగా బిక్షపతి కన్నీరు పెట్టుకున్నారు. మొలుగూరి యువ సేన అధ్యక్షుడు ఏకు కిరణ్... బిక్షపతికి టికెట్ ఇవ్వాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement