అసలు పేరు కంటే కొసరు పేరే ముద్దు | leaders famous with their pet names | Sakshi
Sakshi News home page

అసలు పేరు కంటే కొసరు పేరే ముద్దు

Apr 15 2014 10:35 AM | Updated on Aug 14 2018 4:21 PM

అసలు పేరు ఎంతున్నా.. కొందరు ముద్దుపేర్లతోనే పాపులర్ అవుతుంటారు. ఇలాంటి వారిలో రాజకీయ నాయకులే ఎక్కువ.

అసలు పేరు ఎంతున్నా.. కొందరు ముద్దుపేర్లతోనే పాపులర్ అవుతుంటారు. ఇలాంటి వారిలో రాజకీయ నాయకులే ఎక్కువ. గోదావరి జిల్లాల్లో.. అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మరీ ఎక్కువ. ఇక్కడ పలువురు నాయకుల అసలు పేర్లు చాలామందికి తెలియవు. వాళ్లంతా ముద్దుపేర్లతోనే ప్రాచుర్యం పొందారు. అలాంటివాళ్లలో కొందరి వివరాలు చూద్దాం..

  • ఏలూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల నాని అసలు పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్.
  • ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పూర్తి పేరు మాగంటి వెంకటేశ్వరరావు.
  • తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పూర్తి పేరు ఈలి వెంకట మధుసూదనరావు.
  • రాజ్యసభ మాజీ సభ్యుడు యర్రా నారాయణస్వామిని బెనర్జీగా పిలుస్తుంటారు.
  • మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజును అబ్బాయిరాజుగా పిలిచేవారు.
  • కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావును కృష్ణబాబుగా పిలుస్తారు.
  • పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు అసలు పేరు గెడ్డం సుర్యారావు.
  • డీసీసీ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజును రామం అంటారు.
  • భీమవరం మాజీ ఎమ్మెల్యే  పీవీఎల్ నరసింహరాజును యండగండి నరసింహరాజుగా పిలుస్తారు.
  • డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం అసలు పేరు వెంకటేశ్వరరావు. రత్నం అంటే తప్ప ఎవరికీ తెలియదు.
  • అత్తిలి మాజీ ఎమ్మెల్యే వీకేడీవీ సత్యనారాయణరాజును పాందువ్వ కనకరాజుగా పిలుస్తుంటారు.
  • ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అంటే ఎవరికీ తెలియదు. కలవపూడి శివ అంటేనే తెలుస్తుంది.
  • పెనుగొండ మాజీ ఎమ్మెల్యే కూనపరెడ్డి రాఘవేంద్రరావును చినబాబు అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement